Breaking News

డైరెక్టర్‌పై కోపంతో సోషల్‌ మీడియాలో అశ్లీల వీడియోలు.. కేసు నమోదు!

Published on Tue, 10/08/2024 - 19:20

బంజారాహిల్స్‌: అశ్లీల వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్టు చేయడమే కాకుండా అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తిపై పోలీసులు కేసు  నమోదు  చేశారు. సినీ దర్శకుడు, నిర్మాత షేక్‌ నాగుల్‌ షరీఫ్‌ పాన్‌ ఇండియా సినిమాను నిర్మించేందుకు సాగర్‌ సొసైటీలో కార్యాలయం తెరిచి నటీనటుల కోసం ఆడిషన్స్‌ సైతం మొదలు పెట్టారు. అంతే కాకుండా సినీ ప్రొడక్షన్లకు సంబంధించి ఇన్‌స్టా పేజ్‌ను అందుబాటులోకి  తీసుకువచ్చాడు. ఈ పేజీ అడ్మిన్‌ బాధ్యతలను తన వద్ద పనిచేస్తున్న టి సృజన్‌కు అప్పగించాడు. కానీ సృజన్‌ ఇన్‌స్టా ద్వారా కొంత మందిని రకరకాలుగా వేధించడం మొదలు పెట్టాడు. 

(చదవండి: త్రివిక్రమ్‌ను ప్రశ్నించే దమ్ముందా? నిర్మాతపై పూనమ్‌ కౌర్‌ ఫైర్‌)

విషయం తెలిసిన నాగుల్‌ అతన్ని విధుల్లో నుంచి తొలగించాడు. ఈ నెల 6న సృజన్‌ కార్యాలయానికి వచ్చి నాగుల్‌ను కలిసి తిరిగి ఉద్యోగం ఇవ్వాలని కోరాడు. దీనికి నాగుల్‌ ఒప్పుకోలేదు. దీంతో సృజన్‌ సినీ ప్రొడక్షన్‌కు చెందిన ఇన్‌స్టా పేజీలో సినిమాకు సంబంధించిన విషయాలు తొలగించి అశ్లీల వీడియోలు, ఫొటోలను అప్‌లోడ్‌  చేశాడు. అంతటితో ఆగకుండా ఆ చిత్రాలను కొంత మంది మహిళలకు  పంపించాడు. విషయం తెలుసుకున్న షేక్‌ నాగుల్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)