Breaking News

హైదరాబాద్‌లో షార్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ప్రారంభం..

Published on Sat, 12/20/2025 - 11:12

హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్‌ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. డిసెంబర్ 19 నుంచి 21 వరకు వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి.  తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ (TSFDC), తెలంగాణ ప్రభుత్వ సంస్కృతి, యువజన, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల అంతర్జాతీయ ఉత్సవం నిర్వహించబడుతోంది. 

ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హజరయ్యారు. గౌరవ అతిథిగా పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ వేడుక హైదరాబాద్‌కు మాత్రమే కాకుండా తెలంగాణతో పాటు భారతదేశానికి గర్వకారణమని పేర్కొన్నారు.

యూరప్‌, అమెరికా వంటి దేశాలతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 700కు పైగా లఘు చిత్రాలు ఈ ఫెస్టివల్‌కు వచ్చాయి. హైదరాబాద్‌లోని ప్రసాద్స్‌ ఐమాక్స్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి TSFDC చైర్మన్ దిల్ రాజు అధ్యక్షత వహించారు. I&PR స్పెషల్ కమిషనర్ ప్రియాంక, ప్రముఖ చిత్రనిర్మాతలు, విమర్శకులు, స్క్రీన్ రైటర్లు జూడీ గ్లాడ్‌స్టోన్, మైథిలి రావు, నగేష్ కుకునూర్, లిమా దాస్ కూడా హాజరయ్యారు.

బాలీవుడ్‌ నటుడు టైగర్ ష్రాఫ్ నటించిన జహాన్‌ అనే లఘుచిత్రం హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అవార్డ్‌ రేసులో ఉంది. ఈ మూవీ ఇటీవల ముంబైలో జరిగిన లేక్‌సిటీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించగా టైగర్ ష్రాఫ్ ఉత్తమ నటుడి అవార్డును  అందుకున్నాడు.

 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)