Breaking News

హృతిక్‌ రోషన్‌కు తీవ్ర గాయాలు.. జూ ఎన్టీఆర్‌ 'వార్‌- 2' మరింత ఆలస్యం

Published on Thu, 02/15/2024 - 09:07

ప్ర‌ముఖ బాలీవుడ్ క‌థా నాయ‌కుడు హృతిక్ రోష‌న్ కాలికి గాయ‌మైంది. తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఒక పోస్ట్‌ చేసి ఆయన తెలిపారు. నడుముకు ఒక బెల్ట్‌ పెట్టుకుని క్రచెస్‌ సాయంతో నిలుచున్న ఒక ఫోటోను ఆయన షేర్‌ చేశారు. గతంలో మీలో ఎంతమందికి  ఈ క్రచెస్‌, వీల్‌ చైర్‌ అవరసమెచ్చింది..? ఆ సమయంలో మీ ఫీలింగ్‌ ఏంటి..? అని రాసుకొచ్చారు. గాయంతో కలిగిన బాధ నుంచి ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని తెలిపారు.  ఈ క్రమంలో టైగర్ ష్రాఫ్‌, వరుణ్‌ ధావన్‌ వంటి స్టార్స్‌తో పాటు అభిమానులు మెసేజ్‌లు చేస్తున్నారు. హృతిక్ త్వరగా కోలుకోవాలని వారు ఆశిస్తున్నారు. 

ఫోటోలో హృతిక్ రోష‌న్‌ను గమనిస్తే ఆయనకు తీవ్రమైన గాయాలే అయినట్లు ఉన్నాయి. అందుకు గల కారణాలను మాత్రం ఆయన తెలపలేదు. ఫైటర్‌ షూటింగ్‌ సమయంలో ఏమైనా జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. ఆయన కాలికి గాయం కావడంతో కొద్దిరోజుల పాటు రెస్ట్‌ తీసుకోనున్నారు. దీంతో జూనియర్‌ ఎన్టీఆర్‌- హృతిక్ రోష‌న్ కాంబినేషన్‌లో రానున్న భారీ బడ్జెట్‌ చిత్రం వార్‌-2 షూటింగ్‌ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్‌ అవుతుంది.

'వార్‌' మొదటి భాగంలో హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ హీరోలుగా పోటాపోటీగా నటించారు. ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. దీంతో 'వార్‌2'పై సినీ ప్రియుల్లో ఆసక్తి ఏర్పడింది. ఈ చిత్రాన్ని అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం తారక్‌ డేట్స్‌ కూడా ఇచ్చేశారు. త్వరలో షూటింగ్‌ అనుకుంటున్న సమయంలో హృతిక్‌ రోషన్‌కు గాయం కావడంతో ఈ ప్రాజెక్ట్‌ మరింత ఆలస్యం కావచ్చు అని తెలుస్తోంది.

ఈ ఏడాదిలో 'ఫైటర్'‌ సినిమాతో హిట్‌ కొట్టారు హృతిక్‌ రోషన్‌. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సిద్ధార్థ్‌ ఆనంద్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్‌గా దీపికా పదుకొణె ఉన్నారు. బాక్సాఫీస్‌ వద్ద రూ. 340 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టిన ఈ చిత్రం బాలీవుడ్‌లో ఇప్పటికి కూడా రన్‌ అవుతుంది.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)