Breaking News

రెండు వారాలుగా బెడ్‌పైనే స్టార్ హీరో ప్రియురాలు.. అదే కారణం?

Published on Sat, 03/28/2026 - 15:58

క్రిష్, వార్ 2 తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. గత నాలుగేళ్లుగా షబా ఆజాద్ అనే నటి, సింగర్‌తో రిలేషన్‌లో ఉన్నాడు. గతంలో సుస్సానే ఖాన్‌ని పెళ్లి చేసుకున్నప్పటికీ.. ఆమెకు విడాకులు ఇచ్చేసి షబాతో కలిసి ఉంటున్నాడు. ఇప్పుడు ఈమెకు భయంకరమైన అనారోగ్య సమస్య వచ్చింది. స్వయంగా దాని గురించి ఈమె ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.

(ఇదీ చదవండి: చిరంజీవి చనిపోయారని పోస్ట్‌.. వ్యక్తిపై కేసు)

'సైక్లోస్పోరా కయోటానెన్సిస్' అనే పారాసైట్(పరాన్నజీవి) వల్ల కలిగే వ్యాధిని 'సైక్లోస్పోరియాసిస్' అంటారు. ఇది శరీరంలోకి ప్రవేశిస్తే.. జీర్ణవ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అవుతుంది. షబా అజాద్ ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. గడిచిన 14 రోజులుగా తన జీవితంలో అత్యంత దారుణంగా గడిచాయని చెప్పుకొచ్చింది. రోజుకు రెండుసార్లు జిమ్‌లో వర్కౌట్లు చేసే తాను.. ఇప్పుడు కనీసం టూత్ పిక్ కూడా ఎత్తలేకపోతున్నానని రాసుకొచ్చింది. కేవలం రెండు వారాల్లోనే 4 కిలోల బరువు తగ్గిపోయానని, దీన్నిబట్టి ఇన్ఫెక్షన్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొంది.

ఈ ఇన్ఫెక్షన్ సోకడం వెనకున్న కారణం తెలిసి షబా షాకయ్యింది. ఎప్పుడూ ఇంటిలో వండిందే తింటానని, బయటకెళ్లినా నీళ్ల బాటిల్ వెంట తీసుకెళ్తానని, ఇంత శుభ్రత పాటించినా ఈ పరాన్నజీవి తన శరీరంలోకి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదని చెప్పింది. మనం తినే ఆకుకూరలు, సలాడ్స్, కూరగాయలు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కూరగాయలు కేవలం నీటితో కడిగితే సరిపోదని, బేకింగ్ సోడాతో శుభ్రం చేయాలని చెప్పుకొచ్చింది. పచ్చిగా తినే ఆహార పదార్థాల ద్వారానే ఇలాంటి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదముందని హెచ్చరించింది. ఈ కష్టకాలంలో హృతిక్ రోషన్(ప్రియుడు) తనకు కొండంత అండగా ఉన్నాడని చెప్పుకొచ్చింది. నా మూడ్ ఎంత బాగోలేకపోయినా పక్కనే ఉండి నవ్విస్తున్నాడని, ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫొటోని షబా షేర్ చేసింది.

(ఇదీ చదవండి: 'ధురంధర్' విలన్ తెలుగు సినిమా.. క్రేజీ అప్‌డేట్)

Videos

ఓటేసి తప్పు చేశాం... చంద్రబాబుపై తిరగబడుతున్న సొంత నియోజకవర్గ ప్రజలు

ఒక్కసారిగా షాకిచ్చిన గోల్డ్..! రాత్రికి రాత్రే భారీ మార్పు..

ఇరాన్ సరిహద్దులకు 17 వేల మంది అమెరికా సైనికులు

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం 60 కోట్లకు పైగా ఆస్థి నష్టం

రహస్య ఫోన్ కాల్.. కట్ చేస్తే మధ్యలోకి ఎలాన్ మస్క్ ఎంట్రీ..?

విశాఖలో దారుణం రిటైర్ అయిన భర్త బెనిఫిట్స్ కోసం వెళ్తే..

ఇల్లీగల్ దందా.. హైదరాబాద్ నడిబొడ్డున ఉల్లంఘన..

కష్టాల్లో కుటుంబ పోషణ.. విశాఖలో చిన్న వ్యాపారుల ఆవేదన

నోయిడా ఎయిర్ పోర్ట్ ప్రారంభించిన మోదీ

ధురంధర్ ను ఫాలో అవుతున్న టాలీవుడ్ దర్శకుడు

Photos

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌ (ఫొటోలు)

+5

మార్కాపురం బస్సు ప్రమాదం.. హృదయ విదారక దృశ్యాలు

+5

అనంతపురంలో దేవరకొండ, రష్మిక సందడి (ఫొటోలు)

+5

భద్రాచలంలో కనుల పండువగా శ్రీసీతారాముల ఎదుర్కోలు ఉత్సాహం (ఫొటోలు)