Breaking News

ఓటీటీలో 'హాట్‌ స్పాట్‌' స్ట్రీమింగ్‌.. పెద్దలకు మాత్రమే అంటూ..

Published on Fri, 07/12/2024 - 19:40

కోలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా ఈ ఏడాది మార్చి 29న హాట్ స్పాట్ సినిమా విడుదలైంది. ఇందులో కలైయరసన్‌, శాండీ మాస్టర్‌, ఆదిత్య నటి గౌరీ కిషన్‌, అమ్ము అభిరామి, జననీ అయ్యర్‌ ముఖ్యపాత్రలు పోషించారు. దర్శకుడు విగ్నేష్‌ కార్తీక్‌ సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  ఈ సినిమాలోని సీన్లతో పాటు కాన్సెప్ట్‌ కూడా చిన్నపిల్లలు చూసేదికాదని దీనికి సెన్సార్‌ కూడా ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది.

సమాజంలో జరుగుతున్న ముఖ్య విషయాలను ఆవిష్కరించే కథా చిత్రంగా 'హాట్ స్పాట్' ఉంటుంది. అయితే, ఈ చిత్రం జులై 17న తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతుందని ఆ సంస్థ ప్రకటించింది.  కళ్లముందు జరిగే అన్యాయాలను పట్టించుకోకపోతే తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఆశక్తికరమైన అంశాలతో పాటు సమకాలీన రాజకీయాలను చర్చించే చిత్రంగా హాట్‌ స్పాట్‌ తెరకెక్కింది.

ఇప్పటికే ఆహాలో తమిళ్‌ వర్షన్‌ ఉంది. ఇప్పుడు తెలుగు వర్షన్‌ను కూడా మేకర్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు.  ఈ చిత్రం విడుదల తర్వాత తమిళనాట పెద్ద చర్చ జరిగింది. తెలుగులో అందుబాటులోకి వచ్చాక ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందో చూడాల్సి ఉంది.

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)