Breaking News

జాగ్రత్త... టోర్నడోల్లో ఎగిరిపోతారు

Published on Sun, 12/29/2024 - 04:48

ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో హాలీవుడ్‌ చిత్రం ట్విస్టర్స్‌ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.

ఎంత పెద్ద విపత్తయినా, వివాదమైనా ముందుగా అమెరికా హాలీవుడ్‌ దర్శకుల మెదళ్లలో పుట్టి, దాని తరువాత వీలైతే అది జరుగుతుంది, లేదంటే ఆ హాలీవుడ్‌ దర్శకుడి ఊహల్లోనే ఉండిపోతుంది. చిన్నపాటి ఈగ నుండి ఇప్పటిదాకా కనీసం ప్రత్యక్షంగా కనిపించని గ్రహాంతరవాసి దాడుల వరకు హాలీవుడ్‌ దర్శకుల ఊహకు కాదేదీ అనర్హం, ఇది జగమెరిగిన సత్యం. కానీ ప్రకృతి మాత్రం అమెరికాలో భౌగోళిక ప్రాతిపదికన నిజంగానే కాస్తంత ప్రచండంగానే ఉంటుంది. వాటిలో ముఖ్యంగా తరచూ కనిపించే టోర్నడోలు. మన పరిభాషలో చెప్పాలంటే సుడిగుండపు తుఫానులు.

వీటి మీద హాలీవుడ్‌ దర్శకుల కన్ను దాదాపు 28 సంవత్సరాల క్రితమే పడింది. 1996లో జెన్‌ డి బాంట్‌ ‘ట్విస్టర్‌’ అనే సంచలనాత్మక సినిమా తీశారు. ఆ రోజుల్లో ఈ సినిమా ప్రపంచ సినీ పరిశ్రమలో పెద్ద హాట్‌ టాపిక్‌. అప్పట్లో 88 మిలియన్లు పెట్టి ఈ సినిమా తీస్తే దాదాపు 500 మిలియన్లు సంపాదించి పెట్టింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా జోసెఫ్‌ కోసిన్సి్క కథ ఆధారంగా మార్క్‌ ఔ. స్మిత్‌ స్క్రీన్‌ప్లేతో లీ ఐజాక్‌ చుంగ్‌ దర్శకత్వం వహించిన 2024 అమెరికన్‌ చిత్రం ట్విస్టర్స్‌’. ప్రస్తుతం ఈ సినిమా జియో సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమ్‌ అవుతోంది. ‘ట్విస్టర్స్‌’ సినిమా పూర్తిగా టోర్నడోల కథాంశంతోనే తెరకెక్కింది. అమెరికా దేశంలో ఒక్లాహామా రాష్ట్రం ఎక్కువగా టోర్నడోలు ప్రభావితమయ్యే ప్రాంతం. 

ఓ టోర్నడో వస్తుందంటే దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? అది ఎప్పుడు ఆగిపోతుంది అన్న లోతైన విశ్లేషణలు చేయడానికి ప్రభుత్వంతో పాటు అనేక ప్రైవేటు సంస్థలు పని చేస్తుంటాయి. ‘ట్విస్టర్స్‌’ సినిమా కథ అటువంటి సంస్థ గురించే. స్ట్రామ్‌ పార్‌ అనే ఈ సంస్థలో ఎంతో అవగాహన ఉన్న కేట్‌ తన సహచరుడు జావి ద్వారా చేరుతుంది. ఓ టోర్నడో ఆపరేషన్‌లో కేట్‌ తన ప్రియుడిని పోగొట్టుకుంటుంది. ఆ బాధలో ఉన్నా ఓ వారం వరకు తాను జావీకి తోడుగా ఉంటానని స్ట్రామ్‌ పార్‌ టీమ్‌లోకి వస్తుంది. కానీ జావి ఇదంతా ఓ స్వార్థం కోసం చేస్తున్నాడని తెలిసి ఇదే టోర్నడో ఆపరేషన్‌లో భాగంగా టోర్నడో వ్రాంగ్లర్‌ అనే యూట్యూబ్‌ సంస్థలోకి టైలర్‌ ఆహ్వానిస్తే వెళుతుంది. టోర్నడో ప్రమాదకర కేటగిరీ ఈయఫ్‌ 5ని వీళ్ళు ఛేజ్‌ చేస్తూ చిక్కుకుంటారు. మరి... వాళ్లు ఆ టోర్నడో నుండి బయటపడ్డారా? లేదా అన్నది మాత్రం సినిమాలోనే చూడాలి. మంచి ఇన్ఫర్మేషన్‌తో చక్కటి థ్రిల్లింగ్‌ మూడ్‌లోకి తీసుకువెళ్లే సినిమా ఈ ‘ట్విస్టర్స్‌’. వర్త్‌ఫుల్‌ టు వాచ్‌.– ఇంటూరు హరికృష్ణ

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)