Breaking News

ప్రమాదం... జాగ్రత్త

Published on Fri, 02/28/2025 - 03:42

ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో హాలీవుడ్‌ చిత్రం ఆంబర్‌ అలర్ట్‌(Amber Alert) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.

అమెరికా దేశానికి సంబంధించి పిల్లల కిడ్నాప్‌ సమయంలో తరచుగా వాడే పదం ఆంబర్‌ అలర్ట్‌. ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు ఇస్తే, వాళ్లు చెప్పే ఆనవాళ్లను బట్టి ఆ సమయంలో, ఆప్రాంతంలో ఉన్న ప్రతి వాహనదారుడికి ఈ ఆంబర్‌ అలర్ట్‌ మెసేజ్‌ వాళ్ల ఫోనులకు పంపించడం జరుగుతుంది. ఇది అమెరికా ప్రభుత్వం 1996 నుండి చేపడుతున్న అధికారిక చర్య.

దీని వల్ల పిల్లల కిడ్నాప్‌కు ఉపయోగించే వెహికల్‌ను త్వరగా కనుక్కోగలుగుతారు. ‘ఆంబర్‌ అలర్ట్‌’ (2024) సినిమా నేపథ్యం కూడా అదే. 2012లో కూడా ఇదే పేరు, నేపథ్యంతో ఓ సినిమా విడుదలైంది. గత ఏడాది విడుదలైన ‘ఆంబర్‌ అలర్ట్‌’ వాస్తవ సంఘటనల ఇతివృత్తంగా రూపోందిన సినిమా. ఈ సినిమా కథ విషయానికొస్తే... పార్కులో ఆడుకుంటున్న షార్లెట్‌ అనే చిన్న పాపను ఓ ఆగంతకుడు కార్లో వచ్చి కిడ్నాప్‌ చేసుకుని తీసుకువెళతాడు.

పాప పార్కులో ఆడుకునేటపుడు వాళ్ల అమ్మ తీసిన వీడియో వల్ల కిడ్నాపర్‌ కారు కొంచం వీడియోలో పడుతుంది. మరో పక్క షేన్‌ అనే క్యాబ్‌ డ్రైవర్‌ తన డ్యూటీ ముగించుకొని ఇంట్లో తన కోసం వేచి ఉన్న తన కొడుకు బర్త్‌ డే పార్టీకి త్వరగా వెళ్లబోతుంటాడు. అదే సమయంలో జాక్‌ అనే లేడీ తాను బుక్‌ చేసుకున్న క్యాబ్‌ వెళ్లిపోవడంతో షేన్‌ని తనను దారిలో వదలమని బ్రతిమాలుకుంటుంది.

ఇద్దరూ తమ ప్రయాణం ప్రారంభించాక సడెన్‌గా ఇద్దరి ఫోన్‌లకు షార్లెట్‌ ఆంబర్‌ అలర్ట్‌ మెసేజ్‌ వస్తుంది. ఇంతలో కిడ్నాపర్‌ డ్రైవ్‌ చేస్తున్న కారు వీళ్ల కంటబడుతుంది. ఆ తరువాత ఏం జరిగిందనేది ఓటీటీ వేదికగా ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమ్‌ అవుతున్న ‘ఆంబర్‌ అలర్ట్‌’ మూవీలోనే చూడాలి. కెర్రీ బెల్లెస్సా దర్శకత్వంలో రూపోందిన ఈ సినిమా గ్రిప్పింగ్‌ అండ్‌ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఓ మంచి థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్ కోసం ‘ఆంబర్‌ అలర్ట్‌’ చూడొచ్చు.  – ఇంటూరు హరికృష్ణ

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)