Breaking News

హిట్‌ 8 లో 8 మంది హీరోలా? ఎవరెవరు?

Published on Sat, 04/05/2025 - 11:55

ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్‌ అని తేడా లేకుండా సీక్వెల్స్‌ సందడి చేస్తున్నాయి. ఒక సినిమా హిట్‌ అయితే అదే లైన్‌తో వరుసగా 2, 3 తీయడం అనేది ఒక సంప్రదాయంగా మారిపోతోంది. అయితే ఇప్పటి దాకా సీక్వెల్స్‌ అంటే 2 లేదా 3కే పరిమితం కాగా...ఓ సినిమా మాత్రం పెద్ద ఎత్తున సీక్వెల్స్‌తో కొత్త ట్రెండ్‌ని సెట్‌ చేయనుంది. ఆ సినిమా పేరు హిట్‌.

నేచురల్‌ స్టార్‌ నాని నిర్మాణ బాధ్యతలు పంచుకుని శైలేష్‌ కొలను  దర్శకత్వంలో రూపొందిన  ‘హిట్‌’ ఫస్ట్, సెకండ్‌ కేస్‌లు రెండూ కమర్షియల్‌ గా విజయాలు దక్కించుకున్నాయి. ఈ నేపధ్యంలో త్వరలోనే హిట్‌ 3 (HIT 3) కూడా రానున్న సంగతి మనకి తెలుసు. ’హిట్‌’ లో విశ్వక్‌ సేన్, ‘హిట్‌ 2’ లో అడివి శేష్, ‘హిట్‌ 3’ లో  నాని హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే.

అయితే ‘హిట్‌’ సిరీస్‌ లో భాగంగా మొత్తం 8 సినిమాలు వస్తాయని గతంలోనే సినిమా టీమ్‌ వెల్లడించింది కాబట్టి  ‘హిట్‌ 4’ ‘హిట్‌ 5’ ‘హిట్‌ 6’ ‘హిట్‌ 7’ ‘హిట్‌ 8’ కూడా తెరకెక్కనున్నట్టు స్పష్టం అవుతోంది. అయితే హిట్‌ 8 కోసం ఓ కొత్త సెన్సేషన్‌ క్రియేట్‌ చేయాలని టీమ్‌ యోచిస్తోందని సమాచారం.   హిట్‌ 1 నుంచి ‘హిట్‌ 7 వరకు నటించిన హీరోలందరూ కలిసి హిట్‌ 8లో తెర పంచుకోనున్నారని తెలుస్తోంది. వీరంతా కలిసి ఓ పెద్ద కేసుని సాల్వ్‌ చేస్తారని అంటున్నారు.

నిజానికి హిట్‌  ‘హిట్‌ 2’లో నాని కనిపించినట్టే హిట్‌ 3లో  హీరో అడివి శేష్, విశ్వక్‌సేన్‌ కూడా కనిపించాల్సి ఉంది. అయితే అడవి శేష్‌ మాత్రం స్పెషల్‌ రోల్‌ చేస్తున్నాడు కానీ,  విశ్వక్‌సేన్‌ మాత్రం లేకపోవడానికి  కారణం...నాని వెనుక చేతులు కట్టుకుని నిలబడటానికి విశ్వక్‌ సేన్‌ సుముఖుత వ్యక్తం చేయలేదని వినికిడి. దీంతో అతని రిఫరెన్స్‌ ను మాత్రమే తీసుకుంటారట.  అయితే హిట్‌ 2లో చేసినట్టే...  క్లైమాక్స్‌ లో ‘హిట్‌ 4’ లో నటించే హీరో ఎవరు అనేది రివీల్‌ చేస్తారంటూ కూడా మరో ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు బాలకృష్ణ ‘హిట్‌ 4’లో హీరో గా చేయనున్నారంటూ  కొన్ని వార్తలు హల్‌చల్‌ చేశాయి. కారణమేమో గానీ అది వాస్తవరూపం దాల్చలేదు. ఇప్పుడు తెలుగులోనూ ప్రేక్షకులకు చిరపరిచితమైన   తమిళ హీరో కార్తీ  ‘హిట్‌ 4’ లో హీరోగా ఫిక్స్‌ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని రివీల్‌ చేసే విధంగా ‘హిట్‌ 3’ లో కార్తీ కామియో ఉంటుందని సమాచారం. అయితే ఈ విశేషాలను టీమ్‌ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో ప్రకటిస్తుందా? లేక సర్‌ప్రైజ్‌ కోసం సీక్రెసీ మెయిన్‌టైన్‌ చేస్తుందా? చూడాలి.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)