Breaking News

నా చేతులతో మొదటి భార్య శవాన్ని మోశా.. బిడ్డను కనగానే..: కమెడియన్‌

Published on Mon, 06/26/2023 - 12:11

తెలుగు సినిమాలో టాప్‌ కమెడియన్‌ ఎవరంటే బ్రహ్మానందం అని టక్కున చెప్పేస్తారు. అలాగే బాలీవుడ్‌లో బడా కమెడియన్‌ అనగానే చాలామందికి రాజ్‌పాల్‌ యాదవ్‌ గుర్తొస్తారు. 25 ఏళ్లుగా హిందీ ప్రేక్షకులకు నవ్వులు పంచుతున్న అతడు తాజాగా తన జీవితంలో జరిగిన ఓ విషాదకర సంఘటనను వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'అప్పుడు రోజులు ఎలా ఉండేవంటే.. 20 ఏళ్లకే మన చేతిలో ఉద్యోగం ఉందంటే చాలు.. జనాలు పెళ్లి చేసుకోమని సలహా ఇస్తూ ఉండేవారు. మా నాన్న వారి మాటలు విని నాకు 20 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశాడు. నా మొదటి భార్య నాకు ఓ బిడ్డను ప్రసాదించి చనిపోయింది.

నా చేతులతో ఆమె శవాన్ని..
నేను ఇతర పనులతో బిజీగా ఉండటంతో ప్రసవమైన మరునాడు ఆమెను వెళ్లి చూద్దామనుకున్నాను. ఇంతలోనే ఆమె మరణించిందన్న కబురు అందింది. ఈ చేతులో ఆమె శవాన్ని మోశాను. తనను హత్తుకుని ఏడ్చాను. అయితే నా కుటుంబం నా కూతురికి తల్లి లేని లోటు తెలియనివ్వకుండా పెంచింది. 2003లో నేను రెండో పెళ్లి చేసుకున్నాను. తన ఊరికి వెళ్లినప్పుడు ఆమె వారి సాంప్రదాయం ప్రకారం తన ముఖం కనిపించకుండా ఓ వస్త్రాన్ని కప్పుకుని ఉంది. ఆమె చాలా తొందరగా మా యాసభాషను నేర్చుకుంది. నేను మా అమ్మతో ఎలా మాట్లాడతానో తను కూడా తనతో అలాగే మాట్లాడేది.

నా రెండో భార్యకు 5 భాషలు వచ్చు
నువ్వు చీర కట్టుకోవాలి లేదంటే ఇలాంటి డ్రెస్‌లే వేసుకోవాలని నా భార్యకు నేనెప్పుడూ ఆంక్షలు పెట్టేవాడిని కాదు. తనకు ఐదు భాషలు వచ్చు. నా తల్లిదండ్రులు, గురువు తర్వాత నన్ను ఎంతగానో సపోర్ట్‌ చేసిన వ్యక్తి నా భార్యే! నా కూతుర్ని కూడా తన కూతురిలా కంటికి రెప్పలా చూసుకుంది. నా కూతురిప్పుడు పెళ్లి చేసుకుని లక్నోలో సెటిలైంది. తను సంతోషంగా ఉంటోందంటే అందుకు కారణం నా కుటుంబం, నా భార్యే! నేను చేసిందేమీ లేదు, వాళ్లవల్లే ఇదంతా సాధ్యమైంది' అని చెప్పుకొచ్చాడు రాజ్‌పాల్‌ యాదవ్‌. కాగా ఇతడు ప్రస్తుతం కార్తీక్‌ ఆర్యన్‌ హీరోగా నటిస్తున్న 'సత్యప్రేమ్‌ కీ కథ', ఆయుష్మాన్‌ ఖురానా 'డ్రీమ్‌ గర్ల్‌ 2' చిత్రాల్లో నటిస్తున్నాడు.

చదవండి: రాజకీయాల్లోకి కీర్తి సురేశ్‌?

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)