Breaking News

తనే నిజ జీవితంలో ఒక సూపర్ పవర్: బుల్లితెర నటి ఎమోషనల్ పోస్ట్

Published on Sun, 07/14/2024 - 20:53

బుల్లితెర నటి హీనా ఖాన్‌ రొమ్ము క్యాన్సర్‌ బారిన పడింది. ఇటీవలే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఆమె బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో  పోరాడుతోంది. ప్రాణాంతక మహమ్మారి సోకిందని భయంతో వణికిపోకుండా దాన్ని జయిస్తానని ధైర్యంగా నిలబడింది.  హీనా ఖాన్‌కు ప్రస్తుతం క్యాన్సర్‌ మూడో స్టేజీ ఉండడంతో వెంటనే వైద్యం ప్రారంభించారు. ఇటీవలే ఆమెకు కీమోథెరపీ కూడా చేశారు. ఇలాంటి సమయంలో అమ్మ ప్రేమ తనపై చూపించిన ప్రేమను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

హీనా ఖాన్ తన ఇన్‌స్టాలో.. 'మనకు ఏదైనా జరిగిన తల్లి హృదయం ఎంత తల్లడిల్లుతుందో నాకు అర్థమైంది. తన పిల్లలకు ప్రేమ, సాంత్వన అందించడానికి ఎంత బాధనైనా భరిస్తుంది. నా రోగం గురించి తెలుసుకున్న రోజు ఆమె అనుభవించిన బాధను మాటల్లో చెప్పలేను. కానీ ఆమెనే నన్ను పట్టుకుని తన బాధను మరచిపోయేందుకు యత్నించింది. తల్లులే ఎల్లప్పుడూ మన  జీవితంలో ఒక సూపర్ పవర్. ఆమె ముందు ప్రపంచం కూడా చిన్నదే. ఆమె తన చేతుల్లో నన్న ఓదార్చి నాకు బలాన్ని ఇవ్వడానికి ఎంతో తపన పడింది' అంటూ పోస్ట్ చేసింది. తల్లి ఒడిలో కూర్చుని ఉన్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.

కాగా.. హీనా ఖాన్‌.. యే రిష్తా క్యా కెహ్లాతా హై సీరియల్‌తో ఫేమస్‌ అయింది. కసౌటి జిందగీ కే, నాగిన్‌ (5వ సీజన్‌) సీరియల్స్‌లో ముఖ్య పాత్ర పోషించింది. హిందీ బిగ్‌బాస్‌ 11వ సీజన్‌లోనూ అలరించింది. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లలోనూ మెప్పించింది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)