Breaking News

Wedding: క్యాన్సర్‌తో నటి.. కంటికి రెప్పలా చూసుకునే ‍ప్రియుడు..

Published on Wed, 06/04/2025 - 18:58

బుల్లితెర సెలబ్రిటీ జంట హీనా ఖాన్‌ (Hina Khan)- రాకీ జైస్వాల్‌ (Rocky Jaiswal) వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. 11 ఏళ్ల ప్రేమాయణానికి శుభం పలుకుతూ బుధవారం నాడు రిజిస్ట్రేషన్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను హీనా ఖాన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంది. ఇద్దరి ప్రపంచాలు వేరైనా ప్రేమ అనే బంధంతో ఒక్క గూటికి చేరాం. రెండు మనసులు ఒక్కటయ్యాయి. ఎవరూ విడదీయలేనంతగా మా బంధం బలపడింది. 

పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన నటి
దాన్ని పెళ్లితో మరింత ముందుకు తీసుకెళ్లాం. మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ వైవాహిక ఫోటోలను షేర్‌ చేసింది. ఇది చూసిన అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే హీనా ఖాన్‌, రాకీ జైస్వాల్‌ 2014 నుంచి డేటింగ్‌ చేస్తున్నారు. తన విజయాల్లోనే కాకుండా కష్టాల్లోనూ ఆమెకు రాకీ అండగా ఉన్నాడు. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమెకు సపోర్ట్‌గా నిలబడ్డాడు. 

సీరియల్స్‌..
కీమోథెరపీ వల్ల ఆమె జుట్టు తీసేయాల్సి వస్తే అతడు సైతం గుండు గీయించుకుని తనకు మద్దతుగా ఉన్నాడు. తల్లిలా దగ్గరుండి సేవ చేశాడు. ఇలాంటి పార్ట్‌నర్‌ దొరకడం తన అదృష్టమని హీనా ఖాన్‌ పలుమార్లు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. హీనా ఖాన్‌.. యే రిష్తా క్యా కెహ్లాతా హై సీరియల్‌తో పాపులారిటీ సంపాదించుకుంది. కసౌటి జిందగీ కే, నాగిన్‌ (5వ సీజన్‌) సీరియల్స్‌లో ప్రధాన పాత్ర పోషించింది. హిందీ బిగ్‌బాస్‌ 11వ సీజన్‌లోనూ అలరించింది. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లలోనూ యాక్ట్‌ చేసింది.

 

 

చదవండి: తీవ్ర దుఃఖంలో శోభన.. మాటలు రావడం లేదంటూ..

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)