టైగర్‌ నాగేశ్వరరావు టీజర్‌పై హైకోర్టు అసహనం

Published on Thu, 08/31/2023 - 08:48

సాక్షి, అమరావతి:  టైగర్‌ నాగేశ్వరరావు సినిమా టీజర్‌లో వాడిన భాష ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ) అనుమతి లేకుండా టీజర్‌ విడుదల చేయడంపై అభ్యంతరం తెలిపింది. తగిన అనుమతులు తీసుకోకుండా టీజర్‌ ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించింది. ఇలాంటి టీజర్ల ద్వారా సమా­జానికి ఏం సందేశం ఇస్తున్నారని నిలదీసింది.

స­మాజం పట్ల బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ధనార్జనే ధ్యేయంగా సినిమాల ని­ర్మా­ణం ఉండకూడదని పేర్కొంది. ఈ మేరకు టైగర్‌ నాగేశ్వరరావు చిత్ర నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌కు నోటీసులు జారీ చేసింది. అలాగే సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ చైర్‌పర్సన్‌ను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. సిని­మాపై అభ్యంతరాల­న్నింటినీ సీబీ­ఎఫ్‌సీ చైర్‌పర్సన్‌కు తెలియ­జేసు­కునేందుకు పిటి­ష­న­­ర్‌కు అనుమతి ఇచ్చింది.

తదుపరి విచారణను సెప్టెంబర్‌ 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. టైగర్‌ నాగేశ్వరరావు సినిమా ఎరుకల సామాజిక వర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ చుక్కా పాల్‌రాజ్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపి టీజర్‌లోని భాషపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

చదవండి: 99% పక్కా అన్నారు, ఏమైందో మరి.. చివరికి నన్ను తీసేశారు.. మై విలేజ్‌ షో అనిల్‌

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)