Breaking News

డ్రగ్స్ కేసు.. నవదీప్‌ విషయంలో హైకోర్ట్ కీలక నిర్ణయం!

Published on Fri, 09/15/2023 - 16:31

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో అతనికి సంబంధమున్నట్లు హైదరాబాద్ సీపీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవదీప్‌ హైకోర్ట్‌ను ఆశ్రయించారు. అతని పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. ఈ కేసులో నవదీప్‌ను ఆరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. 

(ఇది చదవండి: హీరో నవదీప్‌కు నోటీసులు.. డ్రగ్స్‌ కేసులో ఉన్న టాలీవుడ్‌ ప్రముఖులు)

అసలేం జరిగిందంటే.. 

మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్‌లో దొరికిన తీగను లాగుతుంటే టాలీవుడ్‌ డ్రగ్‌ డొంక కదులుతోంది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. ఫిల్మ్‌ ఫైనాన్షియర్‌  కె.వెంకటరమణారెడ్డితో పాటు ‘డియర్‌ మేఘ’ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో టాలీవుడ్‌కు చెందిన హీరో నవదీప్‌తో పాటు నిర్మాత సుశాంత్‌ రెడ్డి కూడా ఉన్నట్లు నగర పోలీసు కమీషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. నవదీప్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతన్ని పట్టుకుంటామని చెప్పారు. అయితే దీనిపై వెంటనే హీరో నవదీప్‌ కూడా స్పందించాడు. అసలు ఆ డ్రగ్స్‌ కేసుతో తనకు సంబంధమే లేదన్నాడు. 

తాను ఎక్కడికి పారిపోలేదు

తాను ఎక్కడికి పారిపోలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నానన్నారు. తన కొత్త సినిమాకి సంబంధించిన సాంగ్ లాంచింగ్ ఈవెంట్లో బీజీగా ఉన్నాయనని ఓ మీడియా ప్రతినిధికి ఆయన  చెప్పారు. అలాగే ట్విటర్‌(ఎక్స్‌) ద్వారా కూడా ఆయన ఈ కేసుపై స్పందించాడు.  అది నేను కాదు జెంటిల్మెన్, నేను ఇక్కడే ఉన్నాను ముందు క్లారిటీ తెచ్చుకోండి థాంక్స్ అని ట్వీట్‌ చేశాడు. 

(ఇది చదవండి: అక్కడ సూపర్‌ హిట్‌.. తెలుగులో రిలీజ్‌ కానున్న మూవీ!)

నవదీప్‌ స్నేహితుడు అరెస్ట్‌

అయితే ఈ కేసులో నవదీప్‌ స్నేహితుడు రాంచందర్‌ని నార్కోటిక్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారమే నవదీప్‌ను డ్రగ్స్‌  కన్స్యూమర్ గా తేల్చారు. ఈ విషయాన్ని సీసీ ఆనంద్‌ మీడియా ముఖంగా తెలియజేశారు. గతంలోనూ టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు విషయంలో నవదీప్‌ పేరు మారుమోగింది.అప్పట్లో ఎక్సైజ్, ఈడీ విచారణకు కూడా ఆయన హాజరయ్యారు. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)