Breaking News

కంగువ అరుదైన సినిమా: సూర్య

Published on Fri, 10/25/2024 - 03:17

‘‘నా సినిమా థియేటర్‌లో రిలీజై రెండేళ్లు దాటింది. అయినా ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’ చిత్రం రీ రిలీజ్‌కి ఫ్యాన్స్‌ చూపించిన స్పందన చూసి భావోద్వేగానికి గురయ్యాను. నాపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతగా మీకు గొప్ప సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనే ‘కంగువ’ లాంటి గొప్ప సినిమా చేశాను. మీరు ఇప్పటిదాకా స్క్రీన్‌ మీద చూడని ఒక అరుదైన మూవీ చేశాం’’ అని హీరో సూర్య అన్నారు. శివ దర్శకత్వంలో సూర్య నటించిన చిత్రం ‘కంగువ’. దిశా పటానీ, బాబీ డియోల్‌ కీలకపాత్రలు చేశారు. రాజా, వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ‘కంగువ’ నవంబరు 14న విడుదల కానుంది.

ఈ సినిమాను నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ సంస్థ రిలీజ్‌ చేస్తోంది. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సూర్య మాట్లాడుతూ–‘‘కంగువ’లాంటి సినిమాలు చేసేందుకు దర్శకుడు రాజమౌళిగారు స్ఫూర్తినిచ్చారు. నటుడిగా కమల్‌హాసన్‌గారిని చూసి స్ఫూర్తి పొందుతుంటాను. ‘కంగువ’ స్ట్రయిట్‌ తెలుగు సినిమా... ఇండియన్‌ సినిమా. తన వాళ్ల కోసం, తను నమ్మిన ధర్మం కోసం ΄పోరాడే వీరుడి చిత్రమిది. మంచి సినిమాలు సమాజంలో ఎంతో మార్పు తీసుకొస్తాయి. నా ‘కాక్క కాక్క’ సినిమా చూసి ఒకరు ఐపీఎస్‌ ఆఫీసర్‌ అయ్యారు. ‘జై భీమ్‌’ సినిమా తర్వాత తమిళనాడులో 3 లక్షల మందికి ఇంటి పట్టాలు వచ్చాయి’’ అని తెలిపారు.

శివ మాట్లాడుతూ– ‘‘కంగువ’ సినిమాను ఎంతోఫ్యాషన్‌తో సూర్యగారి లాంటి ఎక్స్‌ట్రార్డినరీ హీరోతో కలిసి రూపొందించాను. మన దక్షిణాది సినిమాని ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్లాలో రాజమౌళిగారు చూపించారు. నాకు ఆయన ఎంతో స్ఫూర్తినిస్తారు. ఆయన ‘విక్రమార్కుడు’ సినిమాని తమిళంలో ‘సిరుతై’గా రీమేక్‌ చేశాను. ఆ సినిమాతో నా ఇంటి పేరు ముందు ‘సిరుతై’ చేరింది’’ అని పేర్కొన్నారు. ‘‘కంగువ’ కోసం టీమ్‌ అంతా ఎంతోఫ్యాషనేట్‌గా హార్డ్‌వర్క్‌ చేశాం. మా సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’’ అని చె΄్పారు కేఈ జ్ఞానవేల్‌ రాజా. రచయిత, నటుడు రాకేందు మౌళి, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్‌ శశి మాట్లాడారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)