Breaking News

ఆదిపురుష్‌పై సుమన్‌ రివ్యూ.. ప్రభాస్‌కు హ్యాట్సాఫ్‌.. కానీ..

Published on Wed, 06/21/2023 - 12:45

ప్రభాస్‌ రాఘవుడిగా నటించిన ఆదిపురుష్‌ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. మొదటి మూడు రోజులు భారీ లెవల్‌లో కలెక్షన్స్‌ రాబట్టిన ఈ చిత్రం ఆ తర్వాత వసూళ్లు రాబట్టడంలో ఘోరంగా వెనకబడింది. ఇకపోతే శ్రీరామదాసులో రాముడిగా నటించిన సీనియర్‌ నటుడు సుమన్‌ తాజాగా ఆదిపురుష్‌పై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. 'రావణుడు సీతను ఎత్తుకుపోవడం నుంచి ఆమెను రక్షించడం వరకు మాత్రమే ఆదిపురుష్‌ తీశారు. మనం చిన్నప్పటి నుంచి సినిమాల్లో రాముడిని నీలిరంగులోనే చూశాం.

అలాగే రాముడికి మీసాలు, గడ్డాలు కూడా ఉండవు. కానీ ఇందులో రాముడిని సాదాగా చూపించారు. అది చాలా పెద్ద రిస్క్‌. అయినా రెండున్నరేళ్లపాటు ప్రభాస్‌ ఆ బాడీని మెయింటైన్‌ చేయడం చిన్న విషయం కాదు. అందుకు అతడికి హ్యాట్సాఫ్‌ చెప్పాలి. రావణుడికి మోడ్రన్‌ హెయిర్‌ కట్‌ చేశారు. వేషధారణ మార్చారు. అది చాలా తప్పు. ఇలా డైరెక్టర్‌ చేసిన కొన్ని ప్రయోగాలు సినిమాలో ఇబ్బందికరంగా అనిపిస్తాయి. కొన్నిచోట్ల గ్రాఫిక్స్‌ బాగున్నాయి. మరికొన్నిచోట్ల గ్రాఫిక్స్‌ పాతదానిలా ఉన్నాయి.

చదవండి: ఆదిపురుష్‌ 5 రోజుల కలెక్షన్స్‌ ఎంతో తెలుసా?

పాటలు నచ్చాయి. కృతీ సనన్‌ సీత క్యారెక్టర్‌లో బాగా చేసింది. ఈ సినిమాలో ఎమోషన్‌ మిస్‌ అయింది. చాలా చోట్ల సన్నివేశాలు హాలీవుడ్‌ సినిమాను గుర్తుకు తెచ్చాయి. ఈ తప్పులు చేయకపోయి ఉంటే ఇది అంతర్జాతీయ సినిమా అయి ఉండేది. ఆదిపురుష్‌ అనేది పవర్‌ఫుల్‌ టైటిల్‌.. కానీ సినిమా చూసి నిరాశ చెందాను. మైథాలజీ సినిమాలను దక్షిణాదివాళ్లే బాగా హ్యాండిల్‌ చేస్తారు' అని చెప్పుకొచ్చాడు సుమన్‌.

చదవండి: ప్రేమలో అబద్ధాలు, మోసాలు నచ్చవు: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)