Breaking News

కార్పొరేట్ జాబ్ చేయకుండా.. రూ.2 వేల జీతానికే జాయిన్ అయ్యా: హీరో సిద్ధార్థ్

Published on Tue, 07/08/2025 - 16:59

కోలీవుడ్ హీరో సిద్ధార్థ్‌ ఇటీవలే సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆయన హీరోగా నటించిన 3బీహెచ్‌కే జూలై 4న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రానికి శ్రీగణేశ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో మేకర్స్ థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌కు హీరో సిద్ధార్థ్‌, హీరోయిన్ మీతా రఘునాథ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కేవలం రెండు వేల రూపాయలకే అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యానని వెల్లడించారు.

సిద్ధార్థ్ మాట్లాడుతూ..' నేను నా లైఫ్‌ను రెండుసార్లు రీసెట్ చేశాను. ఎంబీఏ పూర్తి చేసి కార్పొరేట్ జాబ్ చేయకుండా సినిమా వైపు వచ్చా. కేవలం రెండు వేల రూపాయలకే మణిరత్నం దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరాను. అప్పుడు నా పేరేంట్స్ నన్ను చూసి ఆందోళనకు గురయ్యారు. వీడేంటి సినిమా సైడ్ వెళ్తున్నాడు.. అది కూడా డైరెక్టర్‌ అవుతానని అంటున్నాడు. వీడు ఏమవుతాడో అని భయపడ్డారు. అక్కడి నుంచి మొదలై 25 ఏళ్ల తర్వాత ఈ రోజు ఒక సింగర్‌గా, నటుడిగా మీ ముందు నిలబడ్డా' అని పంచుకున్నారు.

(ఇది చదవండి: తెలుగులో అద్భుతంగా మాట్లాడిన హీరోయిన్‌.. నోరెళ్లబెట్టిన హీరో సిద్దార్థ్‌)

కాగా.. 3 బీహెచ్‌కే మూవీలో శరత్‌కుమార్‌, దేవయాని, చైత్ర, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూలై 4న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముదుకొచ్చింది. కాగా.. గతేడాది సిద్ధార్థ్‌ వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. హీరోయిన్ ఆదితి రావు హైదరీని ఆయన పెళ్లాడారు. తెలంగాణలోని ఓ ప్రాచీన ఆలయంలో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.
 

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)