Breaking News

వీకెండ్‌లో దూసుకెళ్లిన సరిపోదా శనివారం.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

Published on Sun, 09/01/2024 - 12:11

నేచురల్ స్టార్‌- వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన యాక్షన్‌ చిత్రం సరిపోదా శనివారం. ఆగస్టు 29న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.23.35 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించింది. శనివారం ఒక్కరోజే ఏకంగా రూ.9 కోట్లకు కలెక్షన్స్‌ రాబట్టింది.  ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.52.18 కోట్ల గ్రాస్‌ వసూళ్లు వచ్చాయి. ఈ విషయాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోస్టర్‌ ద్వారా పంచుుకంది. కాదా.. ఇ‍ప్పటికే 1.5 మిలియన్‌ డాలర్లతో ఉత్తర అమెరికాలో తొలి బ్రేక్‌ ఈవెన్‌ సొంతం చేసుకుంది. దీంతో నాని ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

మొదటి రోజు రూ.9 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సరిపోదా శనివారం వీకెండ్‌లోనూ అదే జోరు కొనసాగించింది. ఈ మూవీ కమర్షియల్ హిట్‌ ‍కావడంతో మేకర్స్‌ సక్సెస్‌ మీట్ కూడా నిర్వహించారు. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్‌ ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషించారు. హీరోయిన్‌గా ప్రియాంక మోహన్‌ ఆకట్టుకుంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో అభిరామి, అదితి బాలన్, పి సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ, అజయ్ ఘోష్  ముఖ్య పాత్రలు పోషించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)