Breaking News

పారితోషికంగా నోట్ల కట్టలు.. హైదరాబాద్‌ కింగ్‌ నేనే అన్నట్లు తిరిగా: నాని

Published on Sat, 04/26/2025 - 13:57

తొలి సంపాదన ఎవరికైనా ప్రత్యేకమే.. చాలామంది మొదటి జీతంతో అమ్మానాన్నకు ఏదైనా గిఫ్ట్‌ ఇస్తుంటారు. లేదంటే వారికోసమే ఏదైనా వస్తువు, దుస్తులు కొనుక్కుంటారు. అదీ కాదంటే భద్రంగా దాచిపెట్టుకుంటారు. తాజాగా హీరో నాని (Nani) తన తొలి సంపాదన గురించి ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చాడు. నాని మాట్లాడుతూ.. నా మొదటి జీతం రూ.2,500. క్లాప్‌ అసిస్టెంట్‌గా పని చేసినందుకుగానూ రెండున్నర వేలు ఇచ్చేవారు. కాకపోతే అది డబ్బు రూపంలో కాకుండా చెక్‌ ఇచ్చారు.

చెక్‌ బౌన్స్‌..
అయితే ఆ నిర్మాణ సంస్థ ఏదో కారణాల వల్ల వేరే బ్యాంకుకు మారిపోయింది. అప్పటికే అందరూ చెక్‌లో రాసిన మొత్తాన్ని బ్యాంకులో వేసుకున్నారు. నేను మాత్రం చెక్‌ చూపించుకుంటూ తిరిగాను. 20 రోజుల తర్వాత డబ్బులు డ్రా చేద్దామంటే చెక్‌ బౌన్స్‌ అయింది. తర్వాత వెళ్లి అడగడం ఇష్టం లేక దాన్నలాగే దాచుకున్నాను. ఆ డబ్బులు నాకు రాకపోయినా మంచి జ్ఞాపకంగా ఉండిపోయింది.

తొలి పారితోషికం..
రెండో సినిమా అల్లరి బుల్లోడుకు (అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా) మొదటి నెల రూ.4000 పారితోషికం ఇచ్చారు. చెక్‌ మాత్రం వద్దని చెప్తే వంద రూపాయల నోట్లు ఇచ్చారు. ఆ నోట్ల కట్టను జేబులో పెట్టుకుని నేనే హైదరాబాద్‌ కింగ్‌ అన్నట్లుగా తిరిగాను. నా ఫ్రెండ్స్‌ను బయటకు తీసుకెళ్లాను. దానితోపాటు తర్వాతి మూడు నెలల జీతం దాచిపెట్టి అమ్మానాన్నకు ఉంగరాలు చేయించాను అని చెప్పుకొచ్చాడు.

అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ప్రయాణం
నాని.. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా తన కెరీర్‌ మొదలుపెట్టాడు. రాధా గోపాలం, అల్లరి బుల్లోడు, అస్త్రం, ఢీ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశాడు. అష్టా చమ్మా సినిమాతో హీరోగా మారాడు. స్నేమితుడా, భీమిలి కబడ్డీ జట్టు, అలా మొదలైంది, పిల్ల జమీందార్‌, ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు, ఎవడే సుబ్రహ్మణ్యం, భలే భలే మగాడివోయ్‌, జెంటిల్‌మన్‌, మజ్ను, నేను లోకల్‌, నిన్ను కోరి, జెర్సీ, శ్యామ్‌ సింగరాయ్‌, దసరా, హాయ్‌ నాన్న.. ఇలా అనేక సినిమాలు చేశాడు.

నెక్స్ట్‌ ఏంటి?
చివరగా సరిపోదా శనివారం సినిమాతో అలరించాడు. ప్రస్తుతం హిట్‌ 3 మూవీ చేస్తున్నాడు. శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ మూవీలో కేజీఎఫ్‌ బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయికగా యాక్ట్‌ చేసింది. మరోవైపు నాని.. దసరా డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెలతో ద ప్యారడైజ్‌ సినిమా చేస్తున్నాడు.

చదవండి: ఆపరేషన్‌ అనంతరం వెకేషన్‌లో యాంకర్‌ రష్మీ.. దేవుడింతేనేమో!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)