Breaking News

రతికలాంటి భార్య రావాలి.. హీరోను ఆడేసుకున్నారుగా!

Published on Wed, 10/04/2023 - 10:31

బిగ్‌బాస్‌ హౌస్‌.. ఒక పాఠశాల. ఇందులో వయసు, వృత్తితో సంబంధం లేకుండా ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. కొందరు పాఠాలు నేర్చుకుంటారు, మరికొందరు గుణపాఠంగా మిగులుతుంటారు. ఈ సీజన్‌లోనూ అదే జరిగింది. మొదట్లో మెరుగ్గా రాణిస్తుందనుకున్న రతిక రోజ్‌.. ఊహించని ప్రవర్తనతో, కుటిల బుద్ధి చూపించడంతో సడన్‌గా ఎలిమినేట్‌ అయిపోయింది. అది ఆమెకు పాఠమైతే.. వెన్నుపోట్లు ఎంత ప్రమాదకరమో, ఎలా ప్రవర్తిస్తే జనాలు తీవ్రంగా ఖండిస్తారో, అసలు ఒక అమ్మాయి ఎలా ఉండకూడదో ఆమెను చూసి నేర్చుకోవచ్చని.. తన జర్నీ ఒక గుణపాఠమని నెటిజన్లు భావిస్తున్నారు.

ఒక గంట ఎపిసోడ్‌ చూసి ఆమె తప్పు చేసిందని, ముమ్మాటికీ ఆమెది తప్పేనని ముద్ర వేస్తున్నారు. అక్కడివరకు ఆగిపోతే సరి, కానీ నెట్టింట విపరీతమైన ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఇది ఎక్కడిదాకా వెళ్లిందంటే హీరో కిరణ్‌ అబ్బవరం వరకు! కిరణ్‌ ప్రస్తుతం ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రూల్స్‌ రంజన్‌. ఈ మూవీ అక్టోబర్‌ 6న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఎక్స్‌(ట్విటర్‌)లో అభిమానులతో ముచ్చటించాడు. కొందరు సరదా ప్రశ్నలు వేస్తే మరికొందరు దొరికిందే ఛాన్సని సెటైర్లు కూడా వేస్తున్నారు. అన్నింటికీ ఓపికగా సమాధానాలు, కౌంటర్లు ఇచ్చుకుంటూ పోతున్నాడు. 

ఈ క్రమంలో ఓ నెటిజన్‌.. రూల్స్‌ రంజన్‌ హిట్‌ అయ్యాక నీకు రతిక లాంటి అమ్మాయితో పెళ్లవ్వాలని కోరుకుంటున్నా.. ఆల్‌ ద బెస్ట్‌ అని చెప్పాడు. దీనికి కిరణ్‌ స్పందిస్తూ.. ఎందుకమ్మా నామీద నీకంత పగ.. పెళ్లయితే చేసుకుందాం.. కానీ, ఎలాంటి అమ్మాయి వస్తుందో చూద్దాం.. అని రిప్లై ఇచ్చాడు. 'హీరోలా ఉన్నావ్‌ అన్నా' అన్న కామెంట్‌కు హీరోలా లేకపోయినా పర్లేదు, మీలో ఒకడిలా ఉంటే చాలు అని కౌంటర్‌ ఇచ్చాడు.

చదవండి: నిర్మాతను మోసం చేసిన డైరెక్టర్‌.. చివరి రోజుల్లో వైద్యానికి డబ్బుల్లేక..

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)