Breaking News

సిల్క్ ‍స్మిత సూసైడ్... ఆమెను చూసేందుకు వచ్చిన ఏకైక హీరో అతనే!

Published on Tue, 04/25/2023 - 21:54

సిల్క్ స్మిత పేరు ఇప్పటి సినీ ప్రేక్షకులను తెలియకపోవచ్చు. కానీ అప్పట్లో తెలుగు సినీ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోయే పేరు. ఆ రోజుల్లో తన అందంతో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఆమె చేసిన సాంగ్స్ ఇప్పటికీ కూడా మరిచిపోలేరంటే ఎంతలా పేరు సంపాదించిందో అర్థమవుతోంది. సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయ లక్ష్మి. సిల్క్ స్మిత తమిళ చిత్ర పరిశ్రమలో తన నటన జీవితాన్ని ప్రారంభించింది.

నిజం చెప్పాలంటే.. సిల్క్ స్మిత జీవితం ముళ్ల పాన్పు లాంటిది. అందరూ తెరపై ఆమె అందాన్ని చూశారే కానీ.. దాని వెనుక ఉన్న కష్టాన్ని ఎవరు గుర్తించలేకపోయారు. ఎంతోమంది అభిమానుల గుండెల్లో ఆమె శృంగార తారగానే ముద్రపడిపోయింది. తాజాగా ఆమె ఫోటోను నాని నటించిన దసరా మూవీలో ప్రదర్శించారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆమెకు వీరాభిమాని కావడం వల్లే ఆమె పోస్టర్‌ను సినిమాలో చూపించారు. 

తక్కువ కాలంలోనే ఎన్నో ఆవమానాలు ఎదుర్కొన్న సిల్క్ స్మిత తొందరగానే స్టార్ డమ్  తెచ్చుకుంది. అదే సమయంలో తెరమీద ఆమె అందాలను చూసిన వారే.. బయట చాలా చులకనగా చూసేవారట. వాటితో పాటు మన అనుకున్న వారే ఆస్తి కోసం మోసం చేశాడని తెలియడంతో తాను మరింత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో వాటిని భరించలేక 1996లో బలవన్మరణానికి పాల్పడింది. అప్పట్లో సిల్క్ స్మిత మరణం ఇండస్ట్రీలో ఎంతోమందిని  కలిచివేసింది. 

అంతే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న ఏ ఒక్కరు కూడా భౌతికకాయాన్ని చూడడానికి కూడా రాలేదట. కనీసం ఆమె కుటుంబ సభ్యులు కూడా రాలేదు. ఒక అనాథలా ఆమెకు అంత్యక్రియలు జరిపించారు. కానీ సిల్క్ స్మిత భౌతికకాయాన్ని చూడడానికి ఒకే ఒక్క హీరో వచ్చాడట. అతనే యాక్షన్ కింగ్ అర్జున్. ఎవరేమనుకున్నా తనకు నష్టం లేదని.. ఆమె కడచూపు కోసం వచ్చాడట అర్జున్. అందుకు ప్రధాన కారణం సిల్క్, అర్జున్ మంచి స్నేహితులుగా ఉండేవారట. సిల్క్ స్మిత ఎప్పుడు అర్జున్ తో నేను చనిపోయాక నన్ను చూడడానికి వస్తావా అని అడిగేదని చెప్పారు. తాజాగా ఈ విషయాన్ని కోలీవుడ్‌కు చెందిన సినీ జర్నలిస్టు తోట భావనారాయణ రివీల్ చేసినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరలవుతోంది.

కాగా.. సిల్క్ స్మిత చివరిసారిగా తిరుంబి పార్ చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత ఆమె నాలుగు సినిమాలు మరణానంతరం 2002లో విడుదలయ్యాయి.

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)