Breaking News

కొంపముంచిన కామెడీ స్పూఫ్‌.. ఏకంగా రూ.25 కోట్ల దావా

Published on Sat, 09/20/2025 - 17:24

కామెడీ, ఎంటర్ టైన్‪‌మెంట్ షోల్లో రకరకాలుగా ఆకట్టుకుంటూ ఉంటారు. ఎవరైనా సెలబ్రిటీలు వస్తే ఆయా హీరో లేదా హీరోయిన్ల సినిమాల్లోని పాత్రల స్పూఫ్స్ చేస్తూ అలరించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు అలా చేయడం వల్ల ఓ నిర్మాత హర్ట్ అయ్యాడు. ఏకంగా షో నిర్వహకులపై రూ.25 కోట్ల దావా వేశాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియలో చర్చనీయాంశంగా మారింది.

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హిట్ సినిమాల్లో 'హేరా పేరి'కి ప్రత్యేక స్థానం ఉంటుంది. 2000లో వచ్చిన ఈ చిత్రంలో బాబురావు అనే పాత్రలో పరేశ్ రావల్ చేసే కామెడీ ఐకానిక్‌గా నిలిచిపోయింది. సరే ఇదంతా పక్కనబెడితే రీసెంట్‌గా తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం అక్షయ్ కుమార్.. కపిల్ శర్మ షోకి వచ్చాడు. ఈ క్రమంలోనే బాబురావు పాత్ర స్పూఫ్ చేశారు. కమెడియన్ కికు శారదా ఈ పాత్ర మేనరిజాన్ని ఇమిటేట్ చేసి ఆకట్టుకున్నాడు.

(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన రెండు తెలుగు సినిమాలు)

ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేయగా.. 'హేరా పేరి' నిర్మాత ఫిరోజ్ నడియవాలా హర్ట్ అయ్యారు. తన అనుమతి లేకుండా ఈ పాత్రని కపిల్ శర్మలో షోలో ఇమిటేట్ చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 'బాబురావు అనేది ఓ క్యారెక్టర్ మాత్రమే కాదు. హేరా పేరికి ఆత్మ. మా కష్టం, విజన్, క్రియేటివిటీతో ఆ పాత్రకు ప్రాణం పోశాం. ఆర్థిక లాభాపేక్ష కోసం ఆ పాత్రని ఉపయోగించే హక్కు ఎవరికీ లేదు. ఈ పాత్రని ఇమిటేట్ చేస్తూ ఉన్న కంటెంట్ మొత్తాన్ని సోషల్ మీడియా, నెట్‌ఫ్లిక్స్, టీవీ ఛానెల్స్ నుంచి తొలగించాలి' అని నిర్మాత ఫిరోజ్ సూచించారు.

తన అనుమతి లేకుండా బాబురావు పాత్రని ఇమిటేట్ చేసినందుకుగానూ 24 గంటల్లో క్షమాపణలు చెప్పాలి. అలానే నోటీసులు అందిన రెండు రోజుల్లోగా రూ.25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నిర్మాత ఫిరోజ్.. కపిల్ శర్మ షో నిర్వహకులైన నెట్‌ఫ్లిక్స్‌కు అల్టిమేటం ఇచ్చారు. ఒకవేళ చేయకపోతే చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. మరి షో నిర్వహకులు ఏం చేస్తారో చూడాలి?

(ఇదీ చదవండి: ఆస్కార్ రేసులో పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప)

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)