Breaking News

శ్రావణ భార్గవితో విడాకులు? స్పందించిన హేమచంద్ర

Published on Sat, 11/29/2025 - 11:12

టాలీవుడ్‌ సింగర్స్‌ హేమచంద్ర- శ్రావణ భార్గవి విడిపోయి మూడేళ్లవుతోంది. కానీ, ఇంతవరకు ఈ విషయాన్ని ఈ జంట ధ్రువీకరించలేదు. అసలు దానిపై మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన హేమచంద్రకు విడాకుల విషయంపై ప్రశ్న ఎదురైంది.

మీకేంటి ఉపయోగం?
దానిపై హేమచంద్ర మాట్లాడుతూ.. విడాకుల వార్త నిజమా? కాదా? ఎవరైనా కావాలని రూమర్స్‌ వ్యాప్తి చేస్తున్నారా? అన్న విషయాలు పక్కన పెడితే.. ఈ విషయం గురించి తెలుసుకోవడం వల్ల మీకేమైనా ప్రయోజనం కలుగుతుందా? ఏదైనా పనికొస్తుందంటే చెప్పండి.. అప్పుడు దీని గురించి మాట్లాడతాను. నాపై వచ్చే కామెంట్స్‌ను నేనస్సలు పట్టించుకోను. ఏదో ఒకరకంగా వార్తల్లో ఉండాలనుకునే వ్యక్తిని కాదు.

పనికిమాలిన విషయాలను పట్టించుకోను
మీ అందరికీ నేను సింగర్‌గా తెలుసు. ఆ పని గురించి అడగండి. నా మాటల వల్ల ఒక్కరు స్ఫూర్తి పొందినా చాలు. పనికిమాలిన విషయాల గురించి పట్టించుకోను. నా పర్సనల్‌ విషయాల గురించి ఎవరైనా తెలుసుకోవాలనుంటే ఒక షో ఏర్పాటు చేయండి. అక్కడ అందరం కలుసుకుందాం. నీకు ఈ విషయం ఎందుకు తెలుసుకోవాలనుంది? అని నేను అడుగుతా.. కరెక్ట్‌ సమాధానం చెప్పారంటే అప్పుడు నేను జవాబిస్తాను. 

పెళ్లి
చివరగా నేను ఏం చెప్తానంటే నాకు సమయం వచ్చినప్పుడే ఈ విషయం గురించి మాట్లాడతాను అని హేమచంద్ర చెప్పుకొచ్చాడు. హేమచంద్ర  (Hema Chandra)-శ్రావణ భార్గవి 2013లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులు జంటగా యాంకరింగ్‌ కూడా చేశారు. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా 2016లో పాప శిఖర చంద్రిక పుట్టింది. ఎవరి దిష్టి తగిలిందో.. ఏమో.. కానీ ఈ జంట చాలాకాలంగా విడివిడిగానే జీవిస్తున్నారు.

చదవండి: అలా హీరోయిన్‌ అయ్యా: కృతీ శెట్టి

Videos

రవి కార్తీక్ కు జగన్ అభినందనలు..

జనసేన నేతలను చితక్కొట్టిన టీడీపీ అంబటి సెటైర్లు అదుర్స్

చుట్టమల్లే... ఆగలేదా? జూ.ఎన్టీఆర్ పై మళ్లీ...

పడిపోతున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే?

నామినేషన్ వేయకుండా ఆపుతున్న పోలీసులు

చంద్రబాబు గుర్తుపెట్టుకో.. చీర లాగి.. ఇంత దారుణంగా కొడతారా..? జనసేన నేత వార్నింగ్

ప్రసాద్ బాబుకు ఒక న్యాయం.. ఇందిరకు మరో న్యాయమా?

విడుదల రజిని ఘటనపై ధ్రువ్ రాఠీ స్పందన

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

Photos

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు