Breaking News

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ డైరెక్టర్‌ మేనకోడలు!

Published on Sun, 06/01/2025 - 17:02

హీరామండి వెబ్‌ సిరీస్‌తో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న నటి షర్మిన్ సెగల్. సంజయ్ లీలా భన్సాలీ మేనకోడలైన షెర్మిన్‌ హీరామండిలో కీలక పాత్రలో మెప్పించింది. అంతకుముందు బాజీరావ్ మస్తానీ, గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా , మేరీ కోమ్ వంటి చిత్రాలకు  మామ సంజయ్ లీలా బన్సాలీతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది షర్మిన్ సెగల్. ఆ తర్వాతే నటనలోకి అడుగుపెట్టింది. షర్మిన్ సెగల్ 'మలాల్' చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. హీరామండి వెబ్‌ సిరీస్‌తో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకుంది.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటించలేదు. షెర్మిన్‌కు బాబు పుట్టాడని జర్నలిస్ట్ విక్కీ లాల్వానీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు. మే 28న ఆమె తల్లిగా ప్రమోషన్ పొందారని వెల్లడంచారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. షెర్మిన్‌ 2023 నవంబర్‌లో అమన్ మెహతాను పెళ్లాడారు. వీరిద్దరి వివాహం ఇటలీలో గ్రాండ్‌గా జరిగింది. పెళ్లి తర్వాత అహ్మదాబాద్‌లో ఉంటున్న షర్మిన్‌ సెగల్ ఇటీవలే ముంబయికి షిఫ్ట్‌ అయింది.

ఇక సినిమా విషయానికొస్తే షర్మిన్ చివరిసారిగా సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్‌ హీరామండి: ది డైమండ్ బజార్‌లో కనిపించింది. ఈ సిరీస్‌లో అలం జేబ్ పాత్రను అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆమె ఆమె నటనకు తీవ్రంగా ట్రోల్స్ కూడా వచ్చాయి. హీరామండిలో షర్మిన్ తన గ్లామర్‌తో గుర్తింపు దక్కించుకుంది.

కాగా.. సినీ ఇండస్ట్రీకి చెందిన కుటుంబంలో 1995లో జన్మించింది షర్మిన్ సెగల్. తండ్రి, దీపక్ సెగల్ ప్రసిద్ధ నిర్మాణ సంస్థ అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో కంటెంట్ హెడ్‌గా పనిచేశారు.  తల్లి బేలా సెగల్  పాపులర్‌ ఫిల్మ్ ఎడిటర్. తల్లి సోదరుడే , బాలీవుడ్‌ దర్శక దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ. ఖామోషి, దేవదాస్, బ్లాక్  లాంటి ఎన్నో  చిత్రాలకు బేలా సెగల్ పనిచేశారు.

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)