Breaking News

గర్భంతో ఉండగా ప్రతిరోజు భగవద్గీత చదివా..: హీరోయిన్‌

Published on Sat, 08/16/2025 - 16:10

ఈ కృష్ణాష్టమి ఎంతో స్పెషల్‌ అంటోంది హీరోయిన్‌ హర్షిక పూనాచ (Harshika Poonacha). తన జీవితంలోకి చిన్న పాపాయి వచ్చిందని తననే కన్నయ్యగా ముస్తాబు చేశానని చెప్తోంది. తాజా ఇంటర్వ్యూలో హర్షిక మాట్లాడుతూ.. నా చిన్నప్పుడు అమ్మ నన్ను బాగా రెడీ చేసేది. స్కూల్‌లో రాధ వేషం వేసేదాన్ని.. మరికొన్నిసార్లు కృష్ణుడి వేషం వేసేదాన్ని. ఆ జ్ఞాపకాలన్నీ నాతో పదిలంగా ఉన్నాయి. ఆ సాంప్రదాయాన్ని నా కూతురి ద్వారా కొనసాగించాలనుకుంటున్నాను.

భగవద్గీత చదివా..
చాలా ప్రశ్నలకు, సమస్యలకు భగవద్గీతలో సమాధానం దొరుకుతుంది. నేను గర్భంతో ఉన్నప్పుడు ప్రతిరోజు భగవద్గీత చదివేదాన్ని. దానివల్ల మానసికంగా ఎంతో ధృడంగా తయారయ్యాను. ఆస్పత్రిలోని లేబర్‌ రూమ్‌లో పురిటినొప్పులతో బాధపడుతున్నప్పుడు నాకు ధైర్యం చెప్పేందుకు మామయ్య భగవద్గీతలోని శ్లోకాలు చదివాడు. ఇప్పుడు నాకు తొమ్మిది నెలల కూతురు. తనకు ధోతి కట్టి, ముత్యాల దండ వేసి కృష్ణుడిగా రెడీ చేయాలని చాలారోజులుగా అనుకుంటున్నాను. ఈ రోజు అది నెరవేరింది. అలాగే ఈ రోజు పక్కింటి పిల్లల్ని పిలిచి వారికి స్వీట్లు పంచుతాను అని చెప్పుకొచ్చింది.

సినిమా
కర్ణాటకకు చెందిన హర్షిక పునాచ 2008లో నటిగా కెరీర్‌ మొదలుపెట్టింది. తెలుగులో 'ఏడుకొండలవాడ వెంకటరమణ అందరూ బాగుండాలి', 'అప్పుడలా ఇప్పుడిలా' తదితర చిత్రాల్లో హీరోయిన్‌‌గా చేసింది. సోగ్గాడే చిన్ని నాయనా కన్నడ రీమేక్‌లోనూ నటించింది. తెలుగు, కన్నడతో పాటు తమిళ, మలయాళ, కొంకణి, భోజ్‌పురి, కొడవ భాషా చిత్రాల్లోనూ యాక్ట్‌ చేసింది. 2023లో నటుడు భువన్‌ పొన్నానను పెళ్లి చేసుకుంది. గతేడాది చివర్లో పాపకు జన్మనిచ్చింది.

 

 

చదవండి: విడాకులతో సంతోషాన్ని వెతుక్కున్నా.. తప్పేముంది?: మలైకా

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)