Breaking News

నా సినిమాని పట్టుకుని 'తెరి' చేశారు.. హరీశ్ శంకర్ కామెంట్స్

Published on Mon, 03/02/2026 - 17:16

మార్చి నెలాఖరులో టాలీవుడ్ నుంచి రాబోతున్న ఒకేఒక్క పెద్ద సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రంపై ఇప్పటివరకు అనుకున్నంతగా బజ్ లేదు. ఎందుకో రావట్లేదు కూడా. దానికి చాలానే కారణాలు. ప్రాజెక్ట్ మొదలైనప్పుడే ఇది రీమేక్ అనే రూమర్స్ గట్టిగా వినిపించాయి. ఈ మూవీకి రైటర్‌గా పనిచేసిన ఒకప్పటి దర్శకుడు దశరథ్.. ఇది 'తెరి' రీమేక్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇదంతా మొదలైంది. ఇప్పటికే అదే నిజమని చాలామంది ప్రేక్షకులు నమ్ముతున్నారు.

మూవీ టీమ్ గానీ దర్శకుడు హరీశ్ శంకర్ గానీ 'ఉస్తాద్ భగత్ సింగ్' దేనికి రీమేక్ కాదని గతంలో చెప్పారు. తాజాగా పలువురు జర్నలిస్టులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలోనూ హరీశ్ శంకర్.. మరోసారి రీమేక్ గురించి స్పష్టత ఇచ్చాడు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలే ఆసక్తికరంగా అనిపించాయి.

(ఇదీ చదవండి: భర్తని చూస్తూ సిగ్గుపడిపోతూ.. రష్మిక వీడియో వైరల్)

'తెరి మూవీలో ట్వింకిల్ ట్వింకిల్ అంటూ పాడే ఓ సీన్ ఉంటుంది. అది నా 'గబ్బర్ సింగ్' మూవీలోని అంత్యాక్షరి ఎపిసోడ్‌ని స్పూర్తిగా తీసుకుని తీశారు. నా సినిమాని పట్టుకుని తెరి చేస్తే.. నువ్వు 'తెరి' రీమేక్ చేస్తున్నావంటే నేను ఏం సమాధానం చెప్పాలో నాకర్థం కావట్లేదు' అని హరీశ్ శంకర్ అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దాని దిగువన కామెంట్స్ చాలావరకు ఈ దర్శకుడికి వ్యతిరేకంగానే వస్తుండటం విచిత్రం.

కెరీర్‌లో చాలా సినిమాలు చేసిన హరీశ్ శంకర్.. 'గబ్బర్ సింగ్'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. కానీ తర్వాత నుంచి ఒక్కటీ సరైన సినిమా తీయలేకపోతున్నాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్, గద్దలకొండ గణేశ్ లాంటి ఒకటి రెండు మూవీస్ ఆకట్టుకున్నప్పటికీ మరీ సూపర్ హిట్ కాలేకపోయాయి. హరీశ్ శంకర్ గత చిత్రం 'మిస్టర్ బచ్చన్' అయితే ఘోరమైన డిజాస్టర్. చూడాలి మరి హరీశ్ శంకర్ ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో? 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)