Breaking News

ఆ హీరోయిన్ నన్ను మునిగిపోకుండా కాపాడింది: టాలీవుడ్ హీరో

Published on Wed, 05/01/2024 - 14:01

సినిమా షూటింగ్ అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయినా సరే ప్రమాదాలు జరుగుతుంటాయి. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. ఒకప్పుడు టాలీవుడ్ హీరో కమ్ నటుడు హరీశ్ కుమార్ ఇలాంటి ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. హీరోయిన్ కరిష్మా కపూర్ తనని కాపాడిందని, లేదంటే చనిపోయేవాడిని అని చెప్పుకొచ్చాడు. ఇంతకీ అసలేం జరిగింది? హరీశ్ ఏం చెప్పాడు?

1990ల్లో హీరోగా ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న నటుడు హరీశ్ కుమార్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా చిన్న వయసులోనే 'ప్రేమ్ ఖైదీ' మూవీతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో స్విమ్మింగ్ పూల్ సీన్ ఉంటుంది. అది షూట్ చేస్తున్న సమయంలో తాను త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నానని, అప్పటి విషయాల్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో హరీశ్ కుమార్ షేర్ చేసుకున్నాడు.

(ఇదీ చదవండి: పవన్ కల్యాణ్‌కి షాక్.. సినిమా నుంచి స్టార్ డైరెక్టర్ తప్పుకొన్నాడా?)

'కరిష్మా.. స్విమ్మింగ్ పూల్‌లో దూకుతుంది. ఆ తర్వాత నేను పూల్‌లో దూకి ఆమెని కాపాడతాను. సినిమాలో మీరు చూసిందైతే ఇదే. కానీ షూటింగ్‌లో మొత్తం రివర్స్‌లో జరిగింది. నాకు స్విమ్మింగ్ రాదు. దీంతో పూల్‌లో దూకిన కాసేపటికే నేను మునిగిపోయాను. నేను ప్రాంక్ చేస్తున్నానని అందరూ అనుకున్నారు. కానీ కరిష్మా నన్ను పట్టుకుంది. నేను ఆమె స్విమ్ సూట్‌ని పట్టుకున్నాను. అలా ఆ రోజు ప్రాణాలతో బయటపడ్డాను' అని నటుడు హరీశ్ కుమార్ చెప్పుకొచ్చాడు.

హరీశ్ కుమార్.. తెలుగులో కొండవీటి సింహం, రౌడీ ఇన్‌స్పెక్టర్, పెళ్లాం చెబితే వినాలి, కొండపల్లి రత్తయ్య, గోకులంలో సీత తదితర చిత్రాల్లో నటించాడు. హిందీ, మలయాళంలోనూ పలు మూవీస్ చేశాడు. 2017 వరకు నటుడిగా పనిచేశాడు గానీ ఆ తర్వాత పెద్దగా బయట కనిపించట్లేదు.

(ఇదీ చదవండి: మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే)

Videos

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మెగా DSCలో అక్రమాలను కప్పిపుచ్చలేక అధికారుల తంటాలు

ఆక్వా రైతులకు మరోసారి బిగ్ షాక్

ఈ లాజిక్ ఎలా మిస్సయ్యావ్ లోకేష్ ఇక నీ చాప్టర్ క్లోజ్..

అన్నాచెల్లెళ్ల టీచర్ జాబ్.. బయటపడ్డ నకిలీ సర్టిఫికెట్ల బాగోతం

DSC అక్రమాల పుట్ట గుట్టురట్ట

అతి దారుణంగా కారణం ఇదేన బస్సు స్టాండ్ లో..! పోలీస్ మార్క్ ట్రీట్ మెంట్

Photos

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)