Breaking News

యూరిన్‌ తాగి 48 రోజులు బతికాడు: హీరో

Published on Mon, 10/13/2025 - 13:55

కోలీవుడ్‌ హీరో హరీశ్‌ కల్యాణ్‌ (Harish Kalyan), అతుల్య రవి జంటగా నటించిన చిత్రం 'డీజిల్‌' (Diesel Movie). తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్‌ 2022లోనే పూర్తయింది.  ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత ఈ సినిమా రిలీజ్‌కు నోచుకుంది. దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్‌ 17న విడుదల కాబోతోంది. పార్కింగ్‌, లబ్బర్‌ పండు మూవీతో హిట్లు అందుకున్న హరీశ్‌.. ఈ సినిమాతో ముచ్చటగా మూడో హిట్‌ కొట్టాలని ఆశగా ఎదురుచూస్తున్నాడు.

షూటింగ్‌కు ముందు ప్రిపరేషన్‌
ఈ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంభాషణ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముచ్చటించాడు. హరీశ్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. డీజిల్‌ మూవీ షూటింగ్‌ ప్రారంభించడానికి ముందు రెండుమూడు రోజులు సముద్రతీరానికి వెళ్లాం. ఆ వాతావరణాన్ని అలవాటు చేసుకునేందుకు సముద్రంలోకి కూడా వెళ్లొచ్చాం. అప్పుడు 70 ఏళ్ల మత్య్సకారుడు నాకో విషయం చెప్పాడు. 

జీవితం విలువ తెలిసొచ్చింది
కొన్నేళ్ల క్రితం ఓ తుపాను వల్ల అతడి పడవ సముద్రంలో నెల రోజులకు పైగా చిక్కుకుపోయింది. తర్వాత బంగ్లాదేశ్‌ సరిహద్దువైపు లాక్కొనిపోయింది. బక్కచిక్కిపోయి పీలగా మారినప్పటికీ ప్రాణాలతోనే బతికిబయటపడ్డాడు. సముద్రంలో ఉన్న 48 రోజులు అతడు తన యూరిన్‌ తాగి ప్రాణాలు కాపాడుకున్నాడు. సముద్రపు నీళ్లు తాగితే శరీరం డీహైడ్రేట్‌ అవుతుంది. అందుకని ఆ పని చేశాడు. అతడు చెప్పింది విన్నాక జీవితం విలువ మరింత తెలిసొచ్చింది అని చెప్పుకొచ్చాడు. 

చదవండి: ఏయ్‌, ఎందుకు అరుస్తున్నావ్‌? ఫస్ట్‌రోజే ఏడ్చేసిన దువ్వాడ మాధురి

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)