Breaking News

ఓటీటీలో 'హరి హర వీరమల్లు'.. నెలరోజుల్లోనే స్ట్రీమింగ్‌!

Published on Fri, 08/01/2025 - 11:44

పవన్ కల్యాణ్‌ నటించిన తొలి పాన్-ఇండియన్ సినిమ 'హరి హర వీరమల్లు' నెలరోజుల్లోనే ఓటీటీలోకి రానుంది. ఈమేరకు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. జులై 24న విడుదలైన ఈ చిత్రానికి క్రిష్, జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. సుమారు రూ. 250 కోట్లతో ఎ.ఎం.రత్నం నిర్మించారు. అయితే, మొదటి ఆటతోనే భారీ డిజాస్టర్‌ టాక్‌ రావడంతో బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో సుమారు రూ. 110 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ మాత్రమే సాధించినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రానుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

'హరి హర వీరమల్లు' ఓటీటీ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఆగష్టు 22న ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని మొదట ఢీల్‌ సెట్‌ చేసుకున్నారట. అయితే, సినిమా డిజాస్టర్‌గా మిగలడంతో నిర్మాతలు తమ ప్లాన్‌లో మార్పులు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్‌ వైరల్‌ అవుతుంది.  తాజా సమాచారం ప్రకారం  వీరమల్లు డిజిటల్ విడుదల విషయంలో పరిశీలిస్తున్నారట.. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్ట్రీమింగ్‌కు తీసుకురావలనే ప్లాన్‌లో ఉన్నారట. అదే జరిగితే 30రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసినట్లు అవుతుంది. అయితే, ఓటీటీ విడుదల విషయంలో మేకర్స్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు.

'హరి హర వీరమల్లు' విడుదలతోపాటు వివాదాలను కూడా తీసుకొచ్చింది. కోహినూర్‌ వజ్రానికి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానమున్నది. దానిది అంతర్జాతీయ ఖ్యాతి. అయితే, ఈ చారిత్రక అంశాల మధ్య వీరమల్లు అనే కల్పిత పాత్రను ప్రవేశపెట్టి ఈ సినిమా తీయడంతో చాలామంది తప్పుబట్టారు. కల్పిత వీరమల్లు ఔరంగజేబుతో పోరాడి గోల్కొండకు వజ్రాన్ని ఎలా తీసుకువస్తాడనేది సినిమా కథగా చెప్పడం ఏంటంటూ విమర్శించారు. ఫాంటసీ పేరుతో చరిత్రను వక్రీకరించడం.. ఆ వక్రీకరణ ద్వారా సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా సినిమా ఉందంటూ కొందరు పేర్కొన్నారు. ఇలా అనేక కారణాల వల్ల సినిమాకు ఎక్కువ నష్టం జరిగింది.

ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా.. బాబీ డియోల్ ప్రధాన ప్రతినాయకుడిగా నటించారు. నాసర్, సునీల్, దలీప్ తాహిల్, ఆదిత్య, సచిన్ ఖేడేకర్ కూడా ఉన్నారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)