'వీరమల్లు' ఈ రుద్దుడు ఎందుకు..?

Published on Thu, 07/17/2025 - 08:55

'గబ్బర్ సింగ్' సినిమాలో 'నాకు కొంచెం తిక్క ఉంది దానికి ఒక లెక్క ఉంది' అంటూ పవన్‌ కల్యాణ్‌ చెప్పిన డైలాగ్‌ చాలా పాపులర్‌ అయింది. అయితే, ఆయన అభిమానులు 'హరి హర వీరమల్లు' సినిమా విషయంలో ఇదే లెక్కను ఫాలో అవుతున్నారనిపిస్తుంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో ఎలాంటి బజ్‌లేని ఈ చిత్రాన్ని ప్రమోట్‌ చేసేందుకు నానాపాట్లు పడుతున్నారు. ట్రైలర్‌ విడుదల సమయంలో వ్యూస్‌ పరంగా ఫేక్‌ చేశారని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మరో కొత్త ప్లాన్‌ వేశారు. ఈ క్రమంలో దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా మీద హరి హర వీరమల్లు పోస్టర్‌ అంటూ అందుకు సంబంధించిన ఫేక్‌ ఫోటోలను వైరల్‌ చేస్తున్నారు. అయితే, అవి నిజమేనని అందరూ నెటిజన్లు కూడా షేర్‌ చేస్తున్నారు. విషయం తెలిసిన వారు మాత్రం ఇలాంటి ఫేక్‌ ప్రచారాలు ఎందుకు చేసుకుంటారని ఘాటుగానే విమర్శిస్తున్నారు.

గత కొన్ని గంటలుగా సోషల్‌మీడియాలో బుర్జ్ ఖలీఫా మీద 'హరి హర వీరమల్లు' పోస్టర్ అంటూ ట్రెండ్‌ అవుతుంది. అయితే, అది నిజమైనది కాదు. సినిమా అధికారిక హ్యాండిల్‌ను అనుకరించే నకిలీ ఖాతా నుంచి మొదటసారి పోస్ట్‌ చేయబడింది. ఆపై వందల కొద్ది పలు పేజీలు దానిని షేర్‌ చేయడంతో వైరల్‌ అయిపోయింది. అంతపెద్ద ఎత్తున పోస్టర్‌ను పంచుకుంటే.. చిత్ర యూనిట్‌ తప్పకుండా తమ అధికారిక పేజీలో షేర్‌ చేస్తుంది కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

సినిమా విడుదలకు కేవలం ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, సినిమా ప్రచార మాత్రం పెద్దగా లేదని కొందరు చెబుతున్నారు. అందుకే ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే, టాలీవుడ్‌లో సినిమా బజ్‌ బాగున్నప్పటికీ.. హిందీ, తమిళ్‌లో పెద్దగా బజ్‌ లేదని చెప్పవచ్చు. ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి ప్రమోషన్‌ కార్యక్రం కూడా చిత్ర యూనిట్‌ నిర్వహించలేదు. హిందీ హక్కులను ఎవరు కొనుగోలు చేశారన్న వివరాలు అధికారికంగా ఇప్పటికీ వెల్లడించలేదు.

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా నటించిన 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వేదికను మేకర్స్‌ ఫైనల్‌ చేశారు. జులై 24న పాన్‌ ఇండియా రేంజ్‌లొ విడుదల కానున్న ఈ మూవీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు విడుదల కానుంది. అయితే, ఈ సినిమా ప్రీరిలీజ్‌ వేడుకను ఈ నెల 20న విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. సినిమా రన్‌టైమ్‌: 2:42 నిమిషాలు ఉన్నట్లు పేర్కొంది.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)