'హరి హర వీరమల్లు' విడుదలలో మార్పులు.. ప్రకటించిన మేకర్స్‌

Published on Fri, 03/14/2025 - 07:57

టాలీవుడ్‌ హీరో పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటించిన  చారిత్రాత్మక తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు’. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమాకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ. దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు.  పవన్‌ సింగిల్‌ హీరోగా నటించిన చిత్రం విడుదల కాక చాలారోజులు అయింది. దీంతో ఆయన నటించిన కొత్త చిత్రం ‘హరి హర వీరమల్లు’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పవన్‌ అభిమానులలు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హరి హర వీరమల్లు’ మే 9న రానున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్‌పై ప్రకటన విడుదలైంది. ఒక పోస్టర్‌తో పాటుగా మే 9న ఈ చిత్రం విడుదల చేస్తున్నామని మేకర్స్‌ ప్రకటించారు. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘కొల్లగొట్టినాదిరో..’ పాట లిరికల్‌ వీడియోను కొద్దిరోజుల క్రితమే రిలీజ్‌ చేశారు.  గణేష్‌ మాస్టర్స్‌ కొరియోగ్రఫీ స్టెప్పులకు అభిమానులు ఫిదా అయ్యారు.  2023లో విడుదలైన ‘బ్రో’ తర్వాత దాదాపు రెండేళ్లకు ‘హరి హర వీరమల్లు’తో పవన్‌ వెండితెరపై అలరించడానికి సిద్ధమవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయని నిర్మాత ఏఎం రత్నం అన్నారు.

పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ మూవీని  క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా పార్ట్‌-1 మాత్రం  మార్చి 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ గతంలో ప్రకటించారు. ఈమేరకు అధికారికంగా ఒక పోస్టర్‌ను కూడా ఆ సమయంలో విడుదల చేశారు. కానీ, పలు కారణాల వల్ల విడుదల విషయంలో జాప్యం జరిగింది. దీంతో మరోసారి విడుదల తేదీని ప్రకటించారు.

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)