Breaking News

పవన్ సినిమా.. చెప్పిన టైంకి రిలీజ్ అవుతుందా?

Published on Fri, 04/11/2025 - 13:10

పవన్ కల్యాణ్ సినిమా మరో నెలలో రిలీజ్ అవుతుంది. అవును మీరు విన్నది నిజమే. అదే 'హరిహర వీరమల్లు'(Hari Hara Veera Mallu Movie). అసలు హైప్ లేదు, దానికి తోడు రిలీజ్ డేట్ పై అనుమానాలు. ‍అయినా సరే చెప్పిన తేదీకే వస్తామని నిర్మాతలు ప్రకటించారు. దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు? అసలేం జరుగుతోంది? 

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు)

అప్పుడెప్పుడో రీఎంట్రీ తర్వాత పవన్ (Pawan Kalyan) ఒప్పుకొన్న సినిమా హరిహర వీరమల్లు. ప్రకటించినప్పుడు మంచి హైప్ ఏర్పడింది. పీరియాడికల్ సబ్జెక్ట్, క్రిష్ దర్శకుడు కావడంతో ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ పవన్ మిగతా మూవీస్ చేశాడు. అవి రిలీజైపోయాయి. ఏళ్లు గడిచిపోయాయి. కానీ హరిహర.. విషయంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి.

అనివార్య కారణాల వల్ల క్రిష్(Director Krish).. సినిమా నుంచి తప్పుకొన్నాడు. నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష‍్ణ.. దర్శకత్వ బాధ్యతలు అందుకున్నాడు. తర్వాత షూటింగ్ మొదలుపెట్టడం పవన్ రాకపోవడం వల్ల ఎటూ కదల్లేదు. లెక్క ప్రకారం మార్చి 27న రిలీజ్ అన‍్నారు. కానీ షూటింగ్ పెండింగ్, గ్రాఫిక్స్ వర్క్ జరగాల్సి ఉండటంతో మే 9కి వాయిదా వేశారు.

(ఇదీ చదవండి: విడాకులు.. అయినా తనను వదలను: ప్రభుదేవా మాజీ భార్య)

విడుదలకు మరో నెలరోజులు కూడా లేదు. అయినా సరే సినిమా రిలీజ్ పై అనుమానాలు వెంటాడుతున్నాయి. ఎందుకంటే పవన్.. ఇంకో 4 రోజులు షూటింగ్ లో పాల్గొనాలట. దానికి తోడు గ్రాఫిక్స్ వర్క్స్ పూర్తి చేయాలి. వీటితో పాటు ప్రమోషన్స్ చేయాలి. మరి ఇవన్నీ నెలలోపు పూర్తి చేసి రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. 

మరోవైపు ఓటీటీ డీల్ గురించి కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈసారి గనుక రిలీజ్ చేయకపోతే అమెజాన్ ప్రైమ్.. డీల్ క్యాన్సిల్ చేసుకునే అవకాశముందంటున్నారు. మరి 'హరిహర వీరమల్లు' ఈసారైనా థియేటర్లలోకి వస్తాడా? వాయిదాకి మొగ్గుచూపుతాడా అనేది చూడాలి.

(ఇదీ చదవండి: విశ్వంభర.. రామరామ సాంగ్‌ ప్రోమో చూశారా?)

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)