Breaking News

'హరిహర వీరమల్లు' మళ్లీ వాయిదా?

Published on Tue, 06/03/2025 - 14:48


పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' మరోసారి వాయిదా పడనుందా? ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఇదే చర్చ నడుస్తోంది. వచ్చే వారం రిలీజ్‌ పెట్టుకుని ఇలా చేస్తున్నారేంటా అని అభిమానులు మళ్లీ తల పట్టుకుంటున్నారు. ఇంతకీ వాయిదా అని వస్తున్న రూమర్స్ నిజమేనా? వినిపిస్తున్న కారణాలేంటి?

సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభంలో అంటే 2019లో అలా పవన్ ఒప్పుకొన్న సినిమా ఇది. 2020 జనవరిలో షూటింగ్ మొదలుపెట్టారు. అ‍ప్పటినుంచి ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని ఎట్టకేలకు గత నెలలో పూర్తి చేశారు. తొలుత క్రిష్ దర్శకుడు కాగా.. కారణాలేంటో తెలీదు గానీ మధ్యలోనే ఇతడు తప్పుకొన్నాడు. దీంతో చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం కొడుకు జ్యోతికృష్ణ.. క్రిష్ స్థానంలోకి వచ్చారు. ఎలాగోలా షూటింగ్ కంప్లీట్ చేశారు.

(ఇదీ చదవండి: కమల్ హాసన్‌కి చివాట్లు పెట్టిన హైకోర్ట్)

తొలుత ఈ ఏడాది మార్చిలో వస్తుందని అన్నారు. వాయిదా పడింది. మే 30న రావడం పక్కా అన్నారు. అప్పుడు కూడా వాయిదా పడింది. ఎట్టకేలకు జూన్ 12న వస్తుందని పక్కా ఫిక్సయ్యారు. ఇందుకు తగ్గట్లు మరో వారంలో తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ కూడా ఉందని డేట్స్ ప్రకటించారు. ప్రస్తుతం సెన్సార్ ముందుకు ఈ చిత్రం వెళ్లింది. కానీ ఇప్పుడు సడన్‌గా వాయిదా పడిందనే టాక్ వినిపిస్తోంది.

జూలైలో 'హరిహర వీరమల్లు' రిలీజ్ ఉండొచ్చని కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు బయ్యర్లు ఇంకా దొరకలేదని, అందుకే వాయిదా వేయనున్నారనే టాక్ వినిపిస్తుంది. మరి ప్రస్తుతం వినిపిస్తున్న రూమర్స్ సంగతేంటి అనేది నిర్మాణ సంస్థ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే సినిమా మీద పెద్దగా హైప్ లేదు. ఇలాంటి టైంలో మరోసారి గనక వాయిదా పడితే మాత్రం ఉన్న కాస్త హైప్ కూడా పోయే అవకాశముంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?

(ఇదీ చదవండి: బర్త్ డే స్పెషల్.. ఇళయరాజా రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)