Breaking News

గుడిలో టాప్‌ హీరోయిన్‌ .. ఫిదా అవుతున్న తమిళ అభిమానులు

Published on Mon, 10/07/2024 - 10:03

తమిళం, తెలుగు భాషల్లో క్రేజీ కథానాయకిగా రాణించిన ముంబాయి బ్యూటీ హన్సిక. 2001లో ధనుష్‌కు జంటగా మాప్పిళై చిత్రం ద్వారా కోలీవుడ్‌కు కథానాయకిగా పరిచయమైన ఈమె తొలి చిత్రంతోనే ఇక్కడ సినీ ప్రముఖులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఎంగేయుమ్‌ కాదల్‌, ఒరు కల్‌ ఒరు కన్నాడీ, బిర్యాని, సింగం 2 వంటి పలు సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించి కోలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అదేవిధంగా తెలుగులోనూ దేశముదురు చిత్రంతో రంగ ప్రవేశం చేసి తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ హీరోలతో నటించి టాప్‌ కథానాయకిగా రాణించారు. అలా 50 చిత్రాలకు పైగా నటించిన హన్సిక 2022లో వివాహం చేసుకున్నారు. 

అయితే నటనకు మాత్రం దూరం కాలేదు. వివాహానంతరం అవకాశాలు తగ్గాయి అన్నది వాస్తవం. దీంతో మళ్లీ మంచి అవకాశాలు దక్కించుకోవడానికి హన్సిక తరచూ తన గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ దర్శక నిర్మాతల దృష్టిలో పడే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కాగా ఆదివారం ఉదయం ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కామాక్షి అమ్మవారి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 

ఈ క్రమంలో హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌ ఒకటి తమిళ వారిని మెప్పిస్తుంది. తాను ముంబైలో పుట్టినా మానసికంగా మాత్రం తాను తమిళ అమ్మాయినే అంటూ హన్సిక ఇచ్చిన స్టేట్‌మెంట్‌ వారిని మెప్పిస్తుంది.  అంతేకాకుండా (నమ్మ ఊరు సాప్పాటు) మన ఊరు భోజనం సూపర్‌ అని ఆమె పోస్ట్‌ చేశారు. దీంతో తమిళ నెటిజన్లు హన్సికను ప్రశంసలతో ముంచెత్తేస్తున్నారు. తమిళ అభిమానుల ప్రేమకు ఫిదా అయిన ఆమె కూడా సంతోషం వ్యక్తం చేసింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.
 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)