Breaking News

'16 ఏళ్లకే హార్మోన్ ఇంజెక్షన్స్.. నా గుండె పగిలిందన్న స్టార్ హీరోయిన్'

Published on Thu, 12/07/2023 - 18:51

టాలీవుడ్‌లో దేశముదురు మూవీతో ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ హన్సిక మోత్వానీ. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన ఇటీవలే 'మై నేమ్ ఈజ్ శృతి' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. శ్రీ‌నివాస్ ఓంకార్ దర్శకత్వంలో బురుగు రమ్య ప్రభాకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్కిన్ మాఫియా కాన్సెప్ట్‌తో తీసిన ఈ మూవీ నవంబర్ 17న థియేటర్లలో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషా చిత్రాల్లో నటించింది.

దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన హన్సిక ఇటీవలే తన మొదటి వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకుంది. తన భర్త సోహెల్ కతురియాలో వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది. అయితే హన్సిక సినీ కెరీర్‌ కంటే ఎక్కువగా వ్యక్తిగతంగానే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. 

అయితే గతంలో హన్సిక 16 ఏళ్ల వయసులోనే హార్మోన్ల ఇంజెక్షన్లు తీసుకుందని పెద్దఎత్తున వార్తలొచ్చాయి. ఈ వివాదంలో ఇప్పటి వరకు ఏదో ఓ సందర్భంలో చర్చ జరుగుతూనే ఉంది. హన్సిక తల్లి మోనా మోత్వానీ వృత్తిరీత్యా స్కిన్ స్పెషలిస్ట్ కావడంతో హన్సిక మరింత యంగ్‌గా కనిపించేందుకు ఆమెకు హార్మోన్ల ఇంజెక్షన్లు ఇచ్చిందని రూమర్స్ వచ్చాయి. అయితే ఈ విషయంపై హన్సిక చాలాసార్లు వివరణ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన హన్సిక మరోసారి ఈ వివాదంపై నోరు విప్పింది. అయితే హన్సికకు హార్మోన్ల ఇంజెక్షన్లు ఇచ్చానన్న వార్తలను ఆమె తల్లి మోనా మోత్వానీ కొట్టిపారేశారు.

హన్సిక మాట్లాడుతూ.. 'ఇలాంటి వార్తలు మా అమ్మను బాధపెట్టినంతగా నన్ను బాధించలేదు. ఎందుకంటే ఈ వార్తలు పూర్తిగా తప్పు ప్రచారమే. నాపై వచ్చినవన్నీ రూమర్స్. దానికి మా అమ్మ చాలా బాధపడింది. అమ్మ పరిస్థితిని చూసి మేమే ఏడ్చాం. ఇలాంటివి వార్తలు మా కుటుంబ సభ్యులు ఎప్పుడు వినలేదు. ఇలాంటి పుకార్లు నా హృదయాన్ని విచ్ఛిన్నం చేశాయి. సోషల్ మీడియాలో ఎవరికైనా ఏదైనా చెప్పే స్వేచ్ఛ ఉంది. కానీ ఒకరి వ్యక్తిగత జీవితం ఎలా పడితే అలా రాయమని చెప్పలేదు కదా.' అని అన్నారు. కాగా.. డిసెంబర్ 2, 2022న ప్రియుడు సోహైల్ కతురియాను హన్సిక వివాహం చేసుకుంది. జైపూర్‌లోని జరిగిన వీరి పెళ్లికి కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు.

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌