Breaking News

ఇండస్ట్రీలో అదంతా గ్యాంబ్లింగ్‌, నేనేమీ పట్టించుకోను: హన్సిక

Published on Mon, 07/03/2023 - 09:56

పైళ్లె ఏడు నెలలే అయ్యింది. ఒక పక్క వైవాహిక జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తూనే మరో పక్క హీరోయిన్‌గా బిజీగా ఉంది హన్సిక. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ కథానాయికగా అర్ధ సెంచరీ దాటేసింది. కాగా హన్సిక హీరో ఆదిపినిశెట్టితో కలిసి నటించిన పార్ట్‌నర్‌ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనడానికి చైన్నెకి వచ్చిన ఈ ముంబై బ్యూటీ ఆదివారం మీడియాతో ముచ్చటించారు.

ఆమె మాట్లాడుతూ వివాహ జీవితం చాలా హ్యాపీగా సాగుతోందని, నట జీవితానికి తన భర్త ఎంతగానో సపోర్ట్‌ చేస్తున్నారని చెప్పింది. తన తల్లి అంతకుమించి అండగా ఉంటున్నారని పేర్కొంది. తనకు నటించడం చాలా ఇష్టమని చెప్పిన ఆమె నటిగా చాలా డ్రీమ్స్‌ ఉన్నాయంది. అయితే లక్ష్యం అంటూ ఏమీలేదని మంచి నటిగా అందరి మనసుల్లో నిలిచిపోవాలన్నదే తన ఆశ అని చెప్పుకొచ్చింది. పలు భాషల్లో 50కి పైగా చిత్రాల్లో నటించడం ఆనందంగా ఉందని తెలిపింది. ఆ అనుభవం చాలా నేర్పిందని పేర్కొంది.

50వ చిత్రం మహాలో కథానాయిక ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించడంతో ఆ తరహా పాత్రలోనే నటించాలని కోరుకోవడం లేదని, పాత్ర నచ్చితే ఎలాంటి చిత్రంలోనైనా నటించడానికి రెడీ అంది. ఇండస్ట్రీలో జయాపజయాలు అన్నవి గ్యాంబ్లింగ్‌ అని.. సీనియర్‌ దర్శకులైనా, వర్ధమాన దర్శకులైనా కథ నచ్చితే నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించింది. పార్ట్‌నర్‌ చిత్రంలో పురుషుడిగా మారే పాత్రను పోషించానని, ఇది పూర్తిగా విలువైన కథా చిత్రంగా ఉంటుందని తెలిపింది.

తాను ఎప్పుడు చాలా జాలీగా ఉంటానని, అందుకే ఈ సినిమాలో నటించానని చెప్పుకొచ్చింది. మీరు నిజజీవితంలో ఎవరుగా మారాలనుకుంటున్నారన్న ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌గా మారాలని కోరుకుంటానంది. భవిష్యత్తులో చిత్ర నిర్మాణం చేపట్టే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు అందుకు అవకాశమే లేదని, అదేవిధంగా దర్శకత్వం వహించే ఆలోచన కూడా లేదని స్పష్టం చేసింది. నటిగా చాలా హ్యాపీగా ఉన్నట్లు హన్సిక పేర్కొంది.

చదవండి: రూ.20 కోట్లతో ఇల్లు కొన్న హీరోయిన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌