Breaking News

ఆ కుటుంబం నుంచి కొత్త హీరో ఎంట్రీ.. ట్రైలర్‌ చూశారా?

Published on Sun, 08/20/2023 - 09:50

సీనియర్‌ నిర్మాత డిస్ట్రిబ్యూటర్‌ కుటుంబం నుంచి ఇప్పుడు మరో హీరో తెరపైకి వస్తున్నారు. ఏఎల్‌ అళగప్పన్‌ కుమారులిద్దరూ ఇండస్ట్రీలో రాణిస్తున్న విషయం తెలిసిందే! విజయ్‌ దర్శకుడిగా, ఉదయ్‌ నటుడిగా కొనసాగుతున్నారు. తాజాగా ఆయన మనవడు(కూతురి కుమారుడు) అమరేష్‌ 'రంగోలి' చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'మా నగరం'లో బాలనటుడిగా పరిచయం అయ్యారు.

ఆ తర్వాత అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ చదువును కొనసాగిస్తున్న అమరేష్‌ ఇప్పుడు రంగోలి చిత్రం ద్వారా హీరో అవతారం ఎత్తారు. ప్రార్థన కథానాయికగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని గోపురం స్టూడియోస్‌ పతాకంపై కె.బాబురెడ్డి, జి సతీష్‌కుమార్‌ నిర్మించారు. వాలి మోహన్‌దాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మరుద నాయకం ఛాయాగ్రహణం, కేఎస్‌ సుందరమూర్తి సంగీతాన్ని అందించారు.

నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ ఒకటో తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం స్థానిక వడపళనిలోని కమలా థియేటర్‌లో చిత్ర ఆడియో, ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. దర్శకుడు కే భాగ్యరాజ్‌, ఆర్వీ ఉదయ్‌కుమార్‌ పాల్గొని ఆడియో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎల్‌ అలగప్పన్‌ కుటుంబసభ్యులందరూ పాల్గొనడం విశేషం. పాఠశాల విద్యార్థుల ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు వాలి మోహన్‌దాస్‌ చాలా చక్కగా తెరపై ఆవిష్కరించారని దర్శకుడు కే.భాగ్యరాజ్‌, ఆర్వీ ఉదయకుమార్‌, ఏఎల్‌ విజయ్‌ ప్రశంసించారు. చిత్రం మంచి విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.

చదవండి: Trisha : 40 ఏళ్ల వయసులో పెళ్లిపై దృష్టి పెట్టిన త్రిష..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)