ఓటీటీలో 'ఫరియా' డార్క్‌ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్‌ ప్రకటన

Published on Thu, 01/08/2026 - 20:11

గుర్రం పాపిరెడ్డి సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు తాజాగా అధికారికంగా ప్రకటన వచ్చేసింది. డార్క్‌ కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రంలో నరేష్‌ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. మురళీ మనోహర్‌ దర్శకత్వంలో డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్‌ బురా, జయకాంత్‌ (బాబీ) నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్‌ 19న విడుదల అయింది. అయితే, సినిమా ప్రమోషన్స్‌ గట్టిగా చేయడంతో ప్రేక్షకులకు సులువుగా కనెక్ట్‌ అయిపోయింది.

గుర్రం పాపిరెడ్డి(Gurram Paapi Reddy ) సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 16న  జీ5(Zee5) వేదికగా స్ట్రీమింగ్‌ కానున్నట్లు ప్రకటించారు. తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు సంపత్‌ నంది వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన మురళీ మనోహర్‌ ఈ మూవీతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇందులో బ్రహ్మానందం జడ్జ్‌ పాత్రలో ఫుల్‌‌ లెంగ్త్‌ రోల్‌ నటించారు.

గుర్రం పాపిరెడ్డి కథేంటంటే..
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఓ గ్రామీణ ప్రాంత యువకుడు గుర్రం పాపిరెడ్డి (నరేశ్‌ అగస్త్య). డబ్బుల కోసం బ్యాంక్‌ దోపిడీకి పాల్పడతాడు. ‍అది విఫలం కావడంతో  మరో ప్లాన్ వేస్తాడు. ఎర్రగడ్డ మెంటల్‌ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న సౌదామిని (ఫరియా అబ్దుల్లా)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆమెతో కలిసి డబ్బుల కోసం విచిత్రమైన స్కెచ్‌ వేస్తాడు. మరో ఇద్దరు ఫ్రెండ్స్‌ మిలటరీ (రాజ్ కుమార్ కాసిరెడ్డి), చిలిపి (వంశీధర్ కోసి) కలిసి గుర్రం పాపిరెడ్డి శ్రీశైలం అడవుల్లోని ఓ శవాన్ని దొంగతనం చేసేందుకు నలుగురు వెళ్తారు. అసలు డబ్బుల కోసం శవాన్ని కిడ్నాప్ చేయడమేంటి? ఆ శవాన్ని హైదరాబాద్‌కు తీసుకురావడం ఎందుకు? అసలు ఆ శవాన్ని దొంగతనం చేసేందుకు వెళ్లిన వీళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? మధ్యలో ఉడ్రాజు (యోగిబాబు)ఎందుకు ఎంటరయ్యాడు? చివరికీ వీళ్ల ప్లాన్ వర్కవుట్ అయిందా? అనేది గుర్రం పాపిరెడ్డి కథ.

Videos

రష్యాను కంట్రోల్ చేయాలంటే గ్రీన్ ల్యాండ్ కావాల్సిందే..

సంక్రాంతి రష్.. భారీగా ట్రాఫిక్ జామ్

సంక్రాంతికి బిగ్ షాక్.. APలో భారీ వర్షాలు

అభివృద్ధి ముసుగులో ఊరు పేరు లేని కంపెనీలకు విశాఖను అమ్మేస్తున్నారు

YSRCP నేతలు హౌస్ అరెస్ట్

స్కిల్ స్కాంలో బాబుకు ఎదురుదెబ్బ ?

మెగా ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తున్న హుక్ స్టెప్ సాంగ్

సంక్రాంతి ప్రయాణం.. MGBSలో భారీ రద్దీ..

టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా.. కారుమూరి నాగేశ్వరరావు రియాక్షన్

మైసూరు బోండంలో మైసూరు ఉండదు.. మన రాజధానిలో అమరావతి ఉండదు

Photos

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రెస్‌మీట్‌లో మెరిసిన.. ఆషికా, డింపుల్‌ (ఫొటోలు)

+5

'రాజాసాబ్' గంగాదేవి.. షూటింగ్ జ్ఞాపకాలతో అభిరామి (ఫొటోలు)

+5

క్యాండిల్ లైట్ వెలుగులో 'ధురంధర్' బ్యూటీ గ్లామర్ షో (ఫొటోలు)

+5

ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (ఫొటోలు)

+5

ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో ‘మహా సంక్రాంతి’ సంబరాలు (ఫొటోలు)

+5

తెలంగాణ : సంక్రాంతి సంబరాలలో సచివాలయం ఉద్యోగులు (ఫొటోలు)

+5

ఏపీలో సంక్రాంతి రద్దీ.. బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు

+5

రెడ్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ నిధి అగర్వాల్

+5

నగరంలో హీరోయిన్‌ డింపుల్‌ హయతీ సందడి (ఫొటోలు)

+5

విజయవాడలో ఘనంగా మహిళా ఫెస్ట్‌ (ఫొటోలు)