Breaking News

ఈ ఏడాది టాప్‌ సాంగ్స్‌ లిస్ట్‌ ప్రకటించిన యూట్యూబ్‌.. తెలుగు పాటకు చోటు

Published on Sun, 12/29/2024 - 08:44

తెలుగు సాంగ్‌ గ్లోబల్‌ రికార్డ్‌ను క్రియేట్‌ చేసింది. 2024లో విడుదలైన సాంగ్స్‌లలో టాప్‌-10 లిస్ట్‌ను యూట్యూబ్‌ అధికారికంగా ప్రకటించింది. అందులో ఇండియా నుంచి ఒక సాంగ్‌ మాత్రమే ఉంది. అయితే, అది తెలుగు సినిమాకు సంబంధించిన పాట కావడం విశేషం.  సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాదిలో 'గుంటూరు కారం'తో సందడి చేశారు.  త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ. 200 కోట్లు రాబట్టింది. అయితే ఈ సినిమాలోని 'కుర్చీ మడతపెట్టి' పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ సాంగ్‌తో లెక్కలేనన్నీ రీల్స్‌ కూడా వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు గ్లోబల్‌ స్థాయిలో మరో అరుదైన ఘనత సాధించింది.

'కుర్చీ మడతపెట్టి' సాంగ్‌ విడుదలైనప్పటి నుంచే యూట్యూబ్‌లో భారీ  క్రేజ్ ఏర్పడింది. 527+ మిలియన్​ వ్యూస్‌తో ఇప్పటికి కూడా నెట్టింట వైరల్‌ అవుతూనే ఉంది. దీంతో 2024 యూట్యూబ్​ టాప్ సాంగ్స్‌లో స్థానం దక్కించుకున్న ఏకైక ఇండియన్‌ పాటగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇదే విషయాన్ని యూట్యూబ్‌ అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 7 టాప్‌ హిట్‌ సాంగ్స్‌ను యూట్యూబ్‌ ప్రకటించింది.  అందులో భారత్‌ నుంచి ఎంపికైన ఏకైక పాట 'కుర్చీ మడతపెట్టి' అనే సాంగ్‌ ఉండటం విశేషం. కేవలం తెలుగులోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ తెలుగు పాట సత్తా చాటడంతో మహేష్‌ అభిమానులు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.

గుంటూరు కారం సినిమా 2024 జనవరి 12న విడుదలైంది. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హారికా అండ్ హసిని బ్యానర్స్‌పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. 'కుర్చీ మడతపెట్టి' సాంగ్‌లో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల, మహేష్‌ వేసిన స్టెప్పులకు థియేటర్స్‌ దద్దరిల్లాయి.
 

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)