రెండో రోజుకే భారీగా తగ్గిపోయిన 'గుంటూరు కారం' కలెక్షన్స్

Published on Sun, 01/14/2024 - 14:38

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'గుంటూరు కారం' సినిమా బాక్సాఫీస్ దగ్గర తడబడుతోంది. తొలిరోజే ఆహా అనే రేంజులో కలెక్షన్స్ రాగా.. రెండో రోజుకి భారీగా డ్రాప్ కనిపించింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అలానే రాబోయే రోజుల్లో మరింతగా తగ్గే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ఇంతకీ ఈ చిత్రానికి ఇలా జరగడానికి కారణాలేంటి? రెండో రోజుల్లో మహేశ్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందనేది ఇప్పుడు చూద్దాం.

మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూడో సినిమా 'గుంటూరు కారం'. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడు చాలా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ షూటింగ్ వాయిదా పడటం, హీరోయిన్ పూజాహెగ్డే, సినిమాటోగ్రాఫర్ తప్పుకోవడం లాంటివి అభిమానులకు సందేహాలు రేకెత్తించాయి. అయినా సరే త్రివిక్రమ్ మీద అందరూ నమ్మకం పెట్టుకున్నారు. కానీ తాజాగా రిలీజైన ఈ సినిమాకు మొట్టమొదటి షో నుంచే మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. దీంతో ప్రేక్షకుల ముందువెనక అయ్యారు.

(ఇదీ చదవండి: సంక్రాంతి మూవీస్.. ఈమె నటిస్తే హిట్ కొట్టడం గ్యారంటీనా?)

అయితే అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల 'గుంటూరు కారం' సినిమాకు తొలిరోజు ఏకంగా రూ 94 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలే ప్రకటించారు. రెండో రోజుకి వచ్చేసరికి రూ.127 కోట్ల వసూళ్లు వచ్చినట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే రెండో రోజు కేవలం రూ 33 కోట్ల వచ్చినట్లే అనమాట. అంటే ఫస్ట్ డే వచ్చిన మొత్తంతో పోలిస్తే ఇది మూడో వంతు. 

'గుంటూరు కారం' కలెక్షన్స్ తగ్గడానికి కారణాలు చూసుకుంటే.. దీనితోపాటే రిలీజైన 'హను-మాన్' హిట్ టాక్ తెచ్చుకోవడం, అలానే 'సైంధవ్', 'నా సామి రంగ' సినిమాలతో థియేటర్ల పంచుకోవడం కూడా వసూళ్ల తగ్గుదలకు కారణాలుగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు కథలోనూ కొత్తదనం లేకపోవడం మహేశ్ సినిమాకి దెబ్బేసినట్లు అభిమానులు మాట్లాడుకుంటున్నారు. సో అదన్నమాట విషయం.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆ తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే)

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)