Breaking News

'శాకుంతలం' సినిమాలో సమంత ధరించిన నగలు ఎన్ని కోట్లో తెలుసా?

Published on Thu, 03/23/2023 - 13:51

సమంత ప్రధానపాత్రలో నటించిన సినిమా శాకుంతలం. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ స్పీడు పెంచిన మేకర్స్‌ తాజాగా ఈసినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారు. శాకుంతలం కోసం సుమారు  14 కోట్ల రూపాయల విలువ చేసే నిజమైన బంగారు, వజ్రాభరణాలు వినియోగించినట్లు డైరెక్టర్‌ గుణశేఖర్ తెలిపారు.

దాన వీర శూర కర్ణలో ఎన్టీఆర్ వాడిన బంగారు కిరీటం స్ఫూర్తితోనే తన సినిమాల్లో హీరో, హీరోయిన్లకు నిజమైన బంగారం, వజ్రాలతో తయారు చేయించిన ఆభరణాలనే వినియోగించినట్లు గుణశేఖర్ వెల్లడించారు. శాకుంతలం ఏప్రిల్ 14న విడుదలవుతున్న సందర్భంగా ఆ చిత్రంలో శకుంతల, దుష్యుంతుడు ధరించిన బంగారు, వజ్రాభరణాల ఫొటోలను హైదరాబాద్ లోని వసుంధర జ్యుయెలరీస్ లో ఆవిష్కరించారు.

ప్రముఖ డిజైనర్ నీతు లుల్లా సారథ్యంలో వసుంధర జ్యుయెలరీస్ శాకుంతలం కోసం సుమారు 6 నుంచి 7 నెలలు శ్రమించి ఆభరణాలను తయారుచేసింది. పూర్తిగా చేతితో తయారు చేసిన ఆభరణాలు... తన పాత్రలకు మరింత అందాన్ని, రాజసాన్ని తీసుకొచ్చాయని గుణశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు.

శకుంతల పాత్ర కోసం 15 కిలోల బంగారంతో సుమారు 14 రకాల ఆభరణాలను తయారు చేసినట్లు తెలిపారు. దుష్యంత మహారాజు పాత్ర కోసం 8 నుంచి 10 కిలోల బంగారంతో ఆభరణాలు తయారు చేశామని, మేనక పాత్రధారి మధుబాల కోసం 6 కోట్లతో వజ్రాలు పొదిగిన దుస్తులను రూపొందించినట్లు గుణశేఖర్ పేర్కొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)