Breaking News

నా తమన్నాతో తిరుగుతున్నావా?.. విజయ్‌ వర్మపై నటుడి కామెంట్స్ వైరల్!

Published on Wed, 04/26/2023 - 19:32

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి పరిచయం ‍అక్కర్లేదు. టాలీవుడ్‌ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన భామ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో నటుడు విజయ్ వర్మతో కలిసి గోవాలో న్యూ  ఇయర్ సెలబ్రేషన్స్‌ చేసుకుంది. ఆ రోజు తమన్నాను విజయ్ ముద్దు పెట్టుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.

అప్పటి నుంచి ఈ జంట ఎక్కడా చూసిన కనిపించడంతో డేటింగ్‌ రూమర్స్ ఊపందుకున్నాయి. చాలా సార్లు విమానాశ్రయాల్లో ఇద్దరు కెమెరాలకు చిక్కడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా మరోసారి ఇద్దరు కలిసి కారులో వెళ్తూ కనిపించారు. దీంతో మిల్కీ బ్యూటీ- విజయ్ వర్మ డేటింగ్ రూమర్స్ మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.

(ఇది చదవండి: ఆ సినిమా ఫలితం తీవ్ర నిరాశకు గురి చేసింది: మధుబాల)

అయితే తాజాగా వీరిద్దరి రిలేషన్‌పై విజయ్ వర్మ స్నేహితుడు, సహానటుడు గుల్షన్ దేవయ్య క్రేజీ కామెంట్స్ చేశారు. విజయ్ వర్మ తన ఇన్‌స్టాలో 'దహాద్'  థ్రిల్లర్ వెబ్‌ సిరీస్ టీజర్‌ను పోస్ట్ చేశారు. ఈ టీజర్ చూసిన గుల్షన్‌.. తమన్నాతో విజయ్ వర్మ డేటింగ్‌పై ఫన్నీగా పోస్ట్ చేశారు. 

గుల్షన్ తన కామెంట్‌లో రాస్తూ..' నా తమన్నాతో నువ్వు తిరుగుతున్నావ్. నాకు సరైన బుద్ధి చెప్పావ్ విజయ్. ఇంకా నా పరువు తీయనందుకు నీకు చాలా థ్యాంక్స్. లేకపోతే ఏం జరిగేదో.. హే రామ్' అంటూ పోస్ట్ చేశారు. అయితే ఇది కావాలనే విజయ్ వర్మను ఆటపట్టించేందుకు చేశాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

(ఇది చదవండి: అమెరికాలో లయ.. ఎలాంటి జాబ్ చేస్తుందో తెలుసా?)

అయితే ఈ జంట తమ రిలేషన్‌పై ఇప్పటివరకు స్పందించలేదు. కాగా.. తమన్నా, విజయ్ మొదటిసారిగా 'లస్ట్ స్టోరీస్ 2' సినిమాలో కలిసి నటించబోతున్నారు. కాగా.. క్రైమ్ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్‌ 'దహాద్‌'లో విజయ్ వర్మ, సోనాక్షి సిన్హా, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్‌ మే 12న అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. ఈ సిరీస్ ట్రైలర్‌ను మే 3న రిలీజ్ చేయనున్నారు. 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)