Breaking News

ఈ చిన్నారిని గుర్తుపట్టారా? స్టార్‌ హీరోయిన్‌గా, వేశ్యగా..

Published on Wed, 01/14/2026 - 19:05

ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌. బాలీవుడ్‌లో అనేక సక్సెస్‌ సినిమాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులోనూ ఒకటీరెండు సినిమాల్లో మెప్పించింది. ప్రాణాంతక క్యాన్సర్‌తో పోరాడి మహమ్మారిపై విజయం సాధించింది. మరి ఎవరో గుర్తుపట్టారా? తనే మనీషా కొయిరాలా.

చిన్నతనంలోనే..
చిన్నప్పుడు మహారాజు గెటప్‌ వేసిన ఫోటోను మనీషా కొయిరాలా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అందులో గుబురు మీసం, పెద్ద బొట్టు, భారీ అలంకరణతో ఠీవీగా కనిపిస్తోంది. ఇది చూసిన అభిమానులు నటనను చిన్నప్పటి నుంచే పుణికి పుచ్చుకుందని కామెంట్లు చేస్తున్నారు. మనీషా.. ఫెరి బేతాల అనే నేపాలీ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. సౌదగర్‌ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. 

సినిమా
తక్కువకాలంలోనే స్టార్‌ హీరోయి్‌గా మారింది. 1942: ఎ లవ్‌స్టోరీ, అకేలే, హమ్‌ అకేలే తుమ్‌, ఖామోషి: ద మ్యూజికల్‌, దిల్‌సే, కంపెనీ, తాజ్‌ మహల్‌, భూత్‌ రిటర్న్స్‌ ఇలా అనేక సినిమాలు చేసింది. బాంబే, ఇండియన్‌ (భారతీయుడు), ముదల్వన్‌ (ఒకే ఒక్కడు), బాబా, మప్పిళ్లై వంటి చిత్రాలతో తమిళంలోనూ క్రేజ్‌ సంపాదించుకుంది. తెలుగులో నాగార్జున క్రిమినల్‌ మూవీ చేసింది.

క్యాన్సర్‌పై పోరాటం
మనీషా స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలో తన జీవిత ఒక్కసారి కుదుపునకు లోనైంది. 2012లో అండాశయ క్యాన్సర్‌ బారిన పడింది. మంచి చికిత్స, మనోధైర్యంతో క్యాన్సర్‌ను జయించింది. ఈమె చివరగా 'హీరామండి: ది డైమండ్‌ బజార్‌' అనే వెబ్‌ సిరీస్‌లో మల్లికాజాన్‌ అనే వేశ్యపాత్రలో యాక్ట్‌ చేసింది. గతేడాది లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రాడ్‌ఫోర్డ్‌ నుంచి గౌరవ డాక్టరేట్‌ పొందింది.

చదవండి: పెళ్లిరోజు గిఫ్ట్‌గా విడాకులు: బాలీవుడ్‌ నటి

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)