Breaking News

ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన 'హన్సిక' సినిమా

Published on Thu, 04/24/2025 - 10:49

హన్సిక నటించిన గార్డియన్‌ సినిమా ఏడాది తర్వాత సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే మేకర్స్‌ ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.  హారర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో హన్సిక ఒక అందమైన యువతిగా, దెయ్యంగా ద్విపాత్రాభినయం చేసింది. ఫిలిం వర్క్స్‌ పతాకంపై విజయ్‌చందర్‌ నిర్మించిన ఈ చిత్రానికి దర్శక ద్వయం శబరి, గురుశరవణన్‌ దర్శకత్వం వహించారు. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలైంది. అయితే, ఈమూవీ బిగ్‌ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఈ మూవీలో సురేష్ చంద్ర‌మీన‌న్‌, శ్రీమాన్ కీల‌క పాత్ర‌లలో నటించారు.

ఔట్‌డేటెడ్ హార‌ర్ మూవీగా ప్రేక్షకులు ఈ చిత్రం గురించి చెప్పుకొచ్చారు. అయితే, గతేడాది మే నెలలో విడుదలైన ఈ చిత్రం సడెన్‌గా 'ఆహా' తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ సినిమా తర్వాత హన్సికకు మరో ఛాన్స్‌ దక్కలేదు.  తెలుగులో చివ‌ర‌గా 105 మిన‌ట్స్ అనే మూవీలో ఆమె నటించింది.  ప్రస్తుతం  న‌షా పేరుతో తెలుగులో ఓ వెబ్‌సిరీస్ చేస్తున్న ఈ బ్యూటీ పలు టీవీ షోలలో జడ్జీగా వ్యవహరిస్తుంది.

అసలు కథేంటంటే..
రోటీన్‌ హారర్ స్టోరీగా ద‌ర్శ‌కుడు శ‌బ‌రి గురుశ‌ర‌వ‌ణ‌న్  తెర‌కెక్కించారు. అప‌ర్ణ (హ‌న్సిక‌) ఇంటీరియ‌ర్ డిజైన‌ర్‌గా ప‌నిచేస్తుంది. ఓ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన అప‌ర్ణ జీవితం ఊహించని మ‌లుపులు తిరుగుతుంది. ఆమెను ఓ ఆత్మ ఆవ‌హిస్తుంది. అప‌ర్ణ స‌హాయంతో సిటీలో పెద్ద మ‌నుషులుగా చెలామ‌ణి అవుతోన్న వారిపై ఆత్మ ప్ర‌తీకారం తీర్చుకుంటుంది? అస‌లు ఆ ఆత్మ ఎవ‌రు? అప‌ర్ణ శ‌రీరంలోకి ఆ ఆత్మ ఎలా ప్ర‌వేశించింది? ఆ ఆత్మ కార‌ణంగా అప‌ర్ణ జీవితంలో ఎలా చిక్కుల్లో ప‌డింది అన్న‌దే అసలు క‌థ‌.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)