Breaking News

పుట్టిన మూడు నెలలకే కూతురు చనిపోయింది: స్టార్ హీరో భార్య

Published on Mon, 09/16/2024 - 17:05

బాలీవుడ్ నటుడు గోవిందా బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. లవ్ 86 మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బాలీవుడ్‌ స్టార్‌ హీరోగా ఎదిగారు. తన సినీ కెరీర్‌లో పలు అవార్డులను అందుకున్నారు. అంతేకాకుండా రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన గోవిందా.. 1987లోనే సునీత అహుజాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన గోవిందా భార్య సునీతా అహుజా ఓ షాకింగ్ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. అయితే తమకు పెళ్లైన ఏడాదికే టీనా జన్మించిందని వెల్లడించింది. కానీ.. టీనా తర్వాత మరో కూతురు కూడా పుట్టిందని సునీత తెలిపింది. కానీ నెలలు నిండకముందే బిడ్డ జన్మించడంతో ఊపిరితిత్తులు అభివృద్ధి చెందక మూడు నెలలకే చనిపోయిందని బాధాకర సంఘటనను గుర్తు చేసుకుంది.

అందువల్లే తన కొడుకు యశ్‌వర్ధన్‌ను చాలా జాగ్రత్తగా పెంచుకున్నట్లు సునీత వెల్లడించింది. అంతే కాదు తన పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లనని వివరించింది. టీనా కంటే యశ్‌ ఎనిమిదేళ్లు చిన్నవాడు కావడంతో చాలా గారాబంగా పెంచుకుంటున్నట్లు పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. తన పిల్లలను పాఠశాల నుంచి నేనే తీసుకువస్తానని సునీత తెలిపింది. 

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)