Breaking News

'ఆ దేవుడు దిగి వచ్చినా మమ్మల్ని విడదీయలేడు'.. విడాకులపై గోవిందా భార్య

Published on Wed, 08/27/2025 - 19:43

గత కొంతకాలంగా బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా ఆయన భార్యతో విడిపోతున్నారంటూ రూమర్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో చాలాసార్లు ఈ టాపిక్ తెరపైకి వచ్చినా.. ఆయన భార్య సునీతా వాటిని కొట్టిపారేసింది. ఇటీవల మరోసారి ఈ జంట విడాకులకు సిద్ధమయ్యారంటూ వార్తలొచ్చాయి. ఆ తర్వాత వీటిని గోవిందా తరఫు లాయర్‌ ఖండించారు. వీరిద్దరి విడాకులకు సంబంధించి ఏ కోర్టులోనూ పిటిషన్ దాఖలు చేయలేదని అభిమానులకు వెల్లడించారు.

ఇవాళ వినాయక చవితి సందర్భంగా తమపై వ‍స్తున్న విడాకుల రూమర్లకు చెక్‌ పెట్టారు గోవిందా దంపతులు. గణనాథునికి సతీసమేతంగా పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా గోవిందా భార్య సునీతా అహుజా తమపై వస్తున్న విడాకుల రూమర్స్‌పై స్పందించారు. ఆ దేవుడు కూడా తమను వేరు చేయలేడంటూ కామెంట్స్ చేసింది. అలాంటి వార్తలు నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. దీంతో వీరిద్దరిపై వస్తున్న డివోర్స్‌ రూమర్స్‌కు ఇక చెక్ పడినట్లే.


విడాకుల వార్తలపై సునీతా మాట్లాడుతూ.. "ఏదైనా జరిగి ఉంటే ఈరోజు మేము చాలా దగ్గరగా ఉండేవాళ్లం కాదు. మా మధ్య మరింత దూరం ఉండేది. పై నుంచి దేవుడు దిగి వచ్చినా మమ్మల్ని ఎవరూ విడదీయలేరు. నా గోవిందా నా వాడు మాత్రమే, మరెవరికి ఆయన హృదయంలో స్థానం లేదు. కాదు. మేము నోరు తెరిచి చెప్పే వరకు దయచేసి మా గురించి వచ్చే వార్తలను నమ్మొద్దు" అని హితవు పలికింది. కాగా.. గోవింద భార్య సునీతా అహుజా తన యూట్యూబ్ ఛానెల్‌లో ఓ భావోద్వేగ వీడియోను షేర్ చేయడంతో విడాకుల రూమర్స్ మొదలయ్యాయి. సునీత ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దాఖలు చేసినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.

కాగా.. గోవిందా కూలీ నంబర్ 1, హీరో నంబర్ 1, హసీనా మాన్ జాయేగి, హద్ కర్ ది ఆప్నే, జోడి నంబర్ 1 లాంటి చిత్రాల్లో నటించారు. ఆయన చివరిసారిగా 'రంగీలా రాజా' అనే చిత్రంలో కనిపించారు. 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)