Breaking News

ప్రతి కుటుంబంలో ఇలాంటివి సహజమే: గోవిందా మేనేజర్‌

Published on Wed, 02/26/2025 - 11:28

బాలీవుడ్‌ పాపులర్‌ జోడీ గోవింద, సునీత అహుజా విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.  37ఏళ్ల వీరి వైవాహిక బంధం బీటలు వారిందని, విడాకులు తీసుకోనున్నారని  కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే, తాజాగా ఈ విషయంపై నటుడు గోవిందా రియాక్ట్‌ అయ్యారు.

తాజాగా ఒక మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో గోవిందాకు విడాకుల ప్రశ్న ఎదురైంది. కొద్దిరోజుల నుంచి తన ఇంటికి చాలామంది ప్రముఖులు రావడంతో ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వచ్చాయని ఆయన అన్నారు. వారందరూ కూడా కేవలం వ్యాపార విషయాల గురించి మాట్లాడేందుకే వచ్చారని ఆయన తెలిపారు. తాను కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉండటం వల్ల వారందరూ వస్తున్నారని చెప్పారు. అయితే, ఇదే సమయంలో ఆయన మేనేజర్‌ ఇలా చెప్పాడు. 'ఫ్యామిలీలో కొంతమంది చేసిన కామెంట్ల వల్లే ఇలాంటి వార్తలు వచ్చాయి. వారి మధ్య విభేదాలు నిజమే. అయితే, విడాకులు తీసుకునేంత పెద్దవి మాత్రం కాదు. ప్రతి కుటుంబంలో ఇలాంటివి సహజమే.. అవి వారిద్దరే పరిష్కరించుకుంటారు.' అని ఆయన పేర్కొన్నారు.

కొద్దిరోజుల క్రితం గోవిందా సతీమణి సునీత అహుజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గోవింద, తాను వేర్వేరుగా ఉంటున్నామని చెప్పారు. ఆపై తన పిల్లలతో కలిసి వేరుగా ఉంటున్నామని చెప్పడంతో విడాకుల వార్తలు వైరల్‌ అయ్యాయి. వచ్చే జన్మ ఉంటే ఆయనకు భార్యగా ఉండాలని కోరుకోవడం లేదని ఆమె చెప్పారు. ఆయన ఎప్పుడూ కూడా తన జీవితాన్ని పనికే అంకితం చేశారని ఆమె అన్నారు. గోవింద, సునీతలకు 1987లో వివాహం అయింది. వీరికి టీనా అహుజా, యశోవర్ధన్‌ అహుజా పిల్లలు ఉన్నారు. 37  ఏళ్ల తర్వాత వారిద్దరు విడిపోతున్నట్లు వార్తలు రావడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
 

Videos

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)