ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ఆడు జీవితం'

Published on Sun, 07/14/2024 - 11:54

ఈ ఏడాది వచ్చిన హిట్‌ చిత్రాల్లో ద గోట్‌ లైఫ్‌ ఒకటి. ఈ మలయాళ మూవీ తెలుగులో ఆడుజీవితం పేరిట విడుదలైంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి బ్లెస్సీ దర్శకత్వం వహించాడు. కేరళకు చెందిన నజీబ్‌ మహ్మద్‌ డబ్బు సంపాదించేందుకు సౌదీ అరేబియాకు వలస వెళ్లి అక్కడ ఎన్నో కష్టాలు పడ్డాడు. వీటన్నింటినీ బెన్యమిన్‌ అనే రచయిత గోట్‌ లైఫ్‌ అనే నవలలో రాసుకొచ్చాడు. దీన్ని ఆధారంగా చేసుకుని ఆడు జీవితం మూవీ తెరకెక్కింది.

మార్చిలో రిలీజ్‌
ఈ మూవీ కోసం పృథ్వీరాజ్‌ ఏడు నెలల్లో 31 కిలోలు బరువు తగ్గాడు. ఓ సన్నివేశం కోసం మూడురోజుల పాటు ఏమీ తినకుండా కఠిన ఉపవాసం చేశాడు. అంతటి అంకితభావంతో ఈ మూవీ కోసం పని చేశాడు. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు రాబట్టింది. కానీ సుమారు నాలుగు నెలలు కావస్తున్నా ఇంతవరకు ఓటీటీలోకి రానేలేదు.

ఓటీటీలో
ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ నెల 19 నుంచి మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఎట్టకేలకు  ఓటీటీలోకి వస్తుండటంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

 

 

చదవండి: Thanksgiving Movie: వయొలెన్స్‌.. వయొలెన్స్‌.. ధైర్యం ఉంటే చూసేయండి

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)