Breaking News

‘ఘటికాచలం’ మూవీ రివ్యూ

Published on Sat, 05/31/2025 - 13:38

నిఖిల్ దేవాదుల హీరోగా నటించిన చిత్రం ‘ఘటికాచలం’. ఈ చిత్రానికి  ఎం.సి.రాజు కథను అందిస్తూ ఒయాసిస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మించారు. అమర్ కామెపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పై ప్రముఖ దర్శకుడు మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ నేడు(మే 31) రిలీజ్‌ చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కౌశిక్ (నిఖిల్ దేవాదుల) మెడిసన్‌ స్టూడెంట్‌.తనకు ఇష్టం లేకపోయినా నాన్న (ప్రభాకర్‌)కోసం డాక్టర్‌ కావాలనుకుంటాడు. కనీసం తనకు ఇష్టం అయిన వంట చేయమని తల్లితో చెప్పలేని ఇంట్రోవర్ట్‌. కాలేజీలో తోటి విద్యార్థిని సంయుక్తని ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెకు చెప్పడానికి భయపడతాడు. ఇష్టంలేని చదువు ఒకవైపు..ఇష్టమైన విషయాలు చెప్పలేక మరోవైపు మానసికంగా ఇబ్బంది పడతాడు. కొన్నాళ్లకు తనకి మాత్రమే ఓ భీకరమైన వాయిస్‌ వినిపిస్తుంది. ఆ వాయిస్‌ అతన్ని కంట్రోల్‌ చేస్తుంది. చదుకోనివ్వదు.. రెబల్‌గా మార్చేస్తుంది. 

ఓ డాక్టర్‌ దగ్గరకి తీసుకెళ్తే.. సైకలాజికల్‌ ప్రాబ్లమ్‌ అని చెబుతారు. బాబాలు,మంత్రగాడి దగ్గరకు తీసుకెళ్తే గాలి సోకిందని చెబుతారు. కౌశిక్‌తో మాట్లాడుతున్న వాయిస్‌ కొన్నేళ్ల క్రితం చనిపోయిన ఘటికాచలంది అని తెలుస్తుంది. అసలు ఘటికాచలం ఎవరు? కౌశిక్‌కి ఎలా పరిచయం అయ్యాడు? ఇంతకీ కౌశిక్‌కి దెయ్యం పట్టిందా లేదా మెంటల్‌ ప్రెజర్‌ తో అలా మారిపోయాడా? చివరకు కౌశిక్‌ ఆరోగ్యంగా బయటపడ్డాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎవరెలా చేశారంటే..
చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలతో ఆకట్టుకున్న నిఖిల్ దేవాదులకి హీరోగా తొలి చిత్రం ఇది. ఫస్ట్‌ మూవీలోనే బలమైన పాత్ర పోషించాడు. ఈ పాత్ర కోసం ఆయన పడిన కష్టం తెరపై కనిపించింది. పాత్ర ఒక్కటే కానీ అందులోనే రెండు మూడు వేరియేషన్స్‌ ఉంటాయి. అలాంటి పాత్రకి నిఖిల్‌ పూర్తి న్యాయం చేశాడు. నటుడిగా అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంటుంది. హీరో తండ్రిగా ప్రభాకర్‌, తల్లిగా దుర్గాదేవి ఉన్నంతలో బాగానే నటించారు. డాక్టర్‌గా ఆర్వికా గుప్తా తెరపై కనిపించేంది కాసేపే అయినా కథకి కీలకమైన పాత్ర ఆమెది. హీరోయిన్‌గా సంయుక్త రెడ్డి నటన ఓకే. జోగినాయుడు రెండు మూడు సీన్లలో కనిపించినా.. తన మార్క్‌ చూపించాడు.మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

సాకేంతికంగా సినిమా బాగుంది. ప్లేవియో కుకురోలో నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌ అయింది. హారర్‌ సన్నివేశాలకు ఆయన అందించిన బీజీఎం అదిరిపోయింది. ఎస్‌ ఎస్‌ మనోజ్‌ కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)