Breaking News

ఓటీటీలో ఫీల్‌గుడ్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Published on Wed, 01/07/2026 - 10:03

యదార్థ సంఘటనలతో తెరకెక్కిన సినిమా అంగమ్మాల్‌. దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్‌ కోడలైన గీత కైలాసం ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి విపిన్‌ రాధాకృష్ణన్‌ దర్శకత్వం వహించాడు. రచయిత పెరుమాళ్‌ మురుగన్‌ రాసిన కొడు తుని అనే కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది నవంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సన్‌ నెక్స్ట్‌లో జనవరి 9 నుంచి ప్రసారం కానుంది. అయితే కేవలం తమిళ భాషలోనే అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేసింది.

అంగమ్మాల్‌ కథ విషయానికి వస్తే..
జీవితాంతం రవిక అంటే ఏంటో తెలీక బండచాకిరీ చేస్తూ కొడుకుల్ని పోషించింది తల్లి. భర్త పోయాక ఇద్దరు కొడుకుల్ని కడుపులో దాచుకుని సాకింది. చిన్న కొడుకు పట్నానికి వెళ్లి చదువుకుంటూ ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకుని సంబంధం మాట్లాడేందుకు అతడి ఊరొస్తామంటారు.

పట్నంలో పెరిగిన హైక్లాస్‌ మనుషులు అమ్మ పద్ధతి, ప్రవర్తన చూస్తే ఏమనుకుంటారు? రవిక లేకుండా చూస్తే నోరెళ్లబెట్టరా? అని ఆలోచించిన చిన్నకొడుకు తల్లిని జాకెట్‌ వేసుకోవాల్సిందేనని పట్టుబడతాడు. చివరకు ఏం జరిగిందనేది మిగతా కథ!

 

 

చదవండి: పెళ్లి చేసుకుంటా: స్త్రీ 2 హీరోయిన్‌

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)