Breaking News

డైరెక్టర్‌ మణిరత్నంకు థ్యాంక్స్‌ చెప్పిన యంగ్‌ హీరో

Published on Sun, 02/05/2023 - 09:14

తమిళ సినిమా: గౌతమ్‌ కార్తీక్‌ ఇటీవలే నటి మంజిమా మోహన్‌ను పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యారు. తాజాగా నటుడిగా మరో మైలురాయిని కూడా టచ్‌ చేశారు. సీనియర్‌ నటుడు కార్తీక్‌ వారసుడిగా 2012లో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన కడల్‌ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమయ్యారు. అలా నటుడిగా 10 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా గౌతమ్‌ కార్తీక్‌ తాజాగా నటిస్తున్న క్రిమినల్‌ చిత్ర షూటింగ్‌లో యూనిట్‌ వర్గాలు కేక్‌ కట్‌ చేసి వేడుకలు చేశారు.

ఈ సందర్భంగా గౌతమ్‌ కార్తీక్‌ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ తనపై నమ్మకంతో మంచి అవకాశాన్ని కల్పించిన దర్శకుడు మణిరత్నంకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన ఈ సినీ ప్రయాణం ఉత్సాహంగానూ, ఉన్నతంగానూ, భయంగానూ, చాలెంజ్‌ గానూ, అద్భుతంగానూ, కొత్త విషయాలను నేర్చుకునే విధంగా ఉందన్నారు. నటుడిగా విజయాలు, అపజయాలు ఇచ్చిన అనుభవంతో ఇకపై మంచి చిత్రాలతో అలస్తారని గౌతమ్‌ కార్తీక్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈయన 1947, పత్తుతల, క్రిమినల్‌ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)